Kajal Aggarwal : అల్లు అర్జున్ ఇచ్చిన సలహా నాకు బాగా ఉపయోగపడింది.. కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా కాజల్ అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొనగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Kajal Aggarwal Interesting Comments on Allu Arjun
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కరోనా సమయంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, ఓ బాబుకి తల్లి అయి ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ అడపాదడపా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాజల్ అగర్వాల్ మొదటి సారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘సత్యభామ’ తో రాబోతుంది. మే 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా కాజల్ అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొనగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్(Allu Arjun) గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నాకు చాలా విలువైన సలహా ఇచ్చాడు. నేను ఇప్పటికి దాన్ని పాటిస్తున్నాను. కెమెరా ఆఫ్ చేశాక కూడా కొంచెం సేపు అదే ఎమోషన్ లో ఉండాలని, ఎడిటింగ్ సమయంలో అది ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఆ సలహా నాకు ఎంతగానో ఉపయోగపడింది అని తెలిపింది.
Also Read : Mehreen Pirzada : ఫైర్ అయిన మెహ్రీన్.. తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా..
ఇక అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ కలిసి ఆర్య 2 సినిమాలో నటించారు. అలాగే ఎవడు సినిమాలో ఇద్దరూ కలిసి కాసేపు కనిపించారు.