Mehreen Pirzada : ఫైర్ అయిన మెహ్రీన్.. తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా..

కొన్ని మీడియా సంస్థ‌లు రాసిన వార్త‌ల‌పై మండిప‌డింది.

Mehreen Pirzada : ఫైర్ అయిన మెహ్రీన్.. తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా..

Mehreen Pirzada slams fake news over her eggs freezing journey warns legal action

Mehreen : తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌టి మెహ్రీన్ పిర్జాదాను ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేసింది. కాగా.. ఇటీవ‌ల మెహ్రీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా వెల్ల‌డించింది. ప్ర‌పంచంలోని చాలా మంది మ‌హిళ‌ల‌కు ఈ ఎగ్ ఫ్రీజింగ్ ప‌ద్ద‌తి గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకే త‌న వీడియోను పోస్ట్ చేసిన‌ట్లు చెప్పింది.

ఆ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. చాలామంది నెగిటివ్‌ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కొంద‌రు ఏకంగా పెళ్లి కాకుండానే గ‌ర్భం దాల్చిందంటూ ప్ర‌చారం చేశారు. తాజాగా వీటిపై మెహ్రీన్ స్పందించింది. కొన్ని మీడియా సంస్థ‌లు రాసిన వార్త‌ల‌పై మండిప‌డింది. నిజం తెలుసుకుని వార్త‌లు రాయాల‌ని సూచించింది. త‌న‌కు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, త‌న గురించి రాసిన వార్త‌ల‌ను తొల‌గించ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న‌ని హెచ్చ‌రించింది.

Devara : ఎన్టీఆర్ పుట్టిన రోజుకి దేవర అప్డేట్ అదే.. వైరల్ అవుతున్న ట్వీట్.. ఫ్యాన్స్ కి పండగే..

కొంత మంది రిపోర్టర్లు తమ ఉద్యోగాన్ని గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమాజం పట్ల తాము ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నాయో అర్థం చేసుకోవాలని సూచించారు. నకిలీ, తప్పుడు సమాచారంతో వార్తలను విక్రయించడం అనైతికమే కాదు.. చట్టవిరుద్ధమ‌ని చెప్పారు. ఎగ్ ఫ్రీజింగ్ కోసం ఓ అమ్మాయి గర్భవతి కానవసరం లేదని, తాను చేసిన పోస్ట్ ఎంతో మందికి అవగాహన కల్పించడం కోసమేన‌ని తెలిపారు.

పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లిదండ్రులు, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకునే అమ్మాయిలు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లల్ని కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని మండిప‌డ్డారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాల‌న్నారు. సమాజంలో బాధ్యత గల రిపోర్టర్లు ఇలా దిగజారడం బాధాకరమ‌ని, త‌న‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వార్తలను వెంటనే తొలగించాలని, లేకపోతే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చ‌రించింది.. ఈ మేర‌కు ఎక్స్‌లో మెహ్రీన్ పోస్ట్ చేసింది.

Vidya Vasula Aham : ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్.. పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే..