Kajal Aggarwal : ఫస్ట్ సినిమా ఆడిషన్‌లో డైరెక్టర్ ఏడవమని చెప్తే.. కాజల్ ఏం చెప్పిందో తెలుసా?

కాజల్ అగర్వాల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'సత్యభామ'తో రానుంది.

Kajal Aggarwal : ఫస్ట్ సినిమా ఆడిషన్‌లో డైరెక్టర్ ఏడవమని చెప్తే.. కాజల్ ఏం చెప్పిందో తెలుసా?

Kajal Aggarwal says Interesting Thing about Lakshmi Kalyanam Movie Audition

Updated On : May 9, 2024 / 8:39 AM IST

Kajal Aggarwal : సినీ పరిశ్రమ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించి చందమామగా మారి తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు, స్టార్ హీరోల సరసన చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కరోనా సమయంలో సైలెంట్ గా లవ్ మ్యారేజ్ చేసేసుకొని ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. కాజల్ కి ఓ బాబు కూడా పుట్టాడు. అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు సినిమాలు రెండూ బ్యాలెన్స్ చేస్తుంది.

గత సంవత్సరం భగవంత్ కేసరి సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించిన కాజల్ అగర్వాల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘సత్యభామ’తో రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా అందులో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ గా యాక్షన్ అదరగొట్టింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సత్యభామ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ అలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చింది. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్తగా దగ్గరైన హీరో..

ఈ ప్రోగ్రాంలో అలీ.. సినీ పరిశ్రమలో లక్ష్మి కళ్యాణంకి తేజ ఎలా ఛాన్స్ ఇచ్చాడు? ఎలా వచ్చావు అని అడగ్గా కాజల్ సమాధానమిస్తూ.. తేజ గారు ఫొటో చూసి ఆడిషన్ కి పిలిచారు. ఆడిషన్ లో నన్ను ఏడవమని చెప్పారు. నేను.. నా లైఫ్ లో నాకు ఏడవడానికి రీజన్ ఏం లేదు, నాకు ఏడ్చే ఫీలింగ్ రావట్లేదు అని చెప్పాను. అప్పుడు మా నాన్న వచ్చి నేను ఏడ్చే విషయం ఒకటి చెప్పారు. దాంతో నేను ఏడ్చేశాను. ఆ ఆడిషన్ ఓకే చేసి నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు తేజ గారు అని తెలిపింది. అయితే ఆడిషన్ అంటే వాళ్ళు ఏం చేసి చూపించమంటే యాక్టింగ్ లో అది చేసి చూపించాలి. కానీ ఏడవమని చెప్తే నాకు ఏడ్చే ఫీలింగ్ లేదు అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.