తన్హాజీ : ది అన్‌సంగ్ వారియర్ : ‘సావిత్రిబాయి ములుసరే’గా కాజోల్

అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న‘తన్హాజీ : ది అన్‌సంగ్ వారియర్’ మూవీ నుండి సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 18, 2019 / 07:47 AM IST
తన్హాజీ : ది అన్‌సంగ్ వారియర్ : ‘సావిత్రిబాయి ములుసరే’గా కాజోల్

Updated On : November 18, 2019 / 7:47 AM IST

అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న‘తన్హాజీ : ది అన్‌సంగ్ వారియర్’ మూవీ నుండి సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ లుక్ రిలీజ్..

బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవ్‌గన్ హీరోగా నటిస్తున్న 100వ సినిమా.. ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’.. సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో.. ఓం రౌత్ దర్శకత్వంలో, అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోమవారం ఈ సినిమాలోని కాజోల్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.

శివాజీ మహారాజ్‌తో కలిసి మరాఠా ప్రజల కోసం పోరాడిన సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే, 1670 వ సంవత్సరంలో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి గొప్ప యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తుండగా, ఆయన భార్య సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ నటిస్తున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. సినిమాలో ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. 3డి టెక్నాలజీలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందీ చిత్రం.

Read Also : డాక్టర్ల పొరపాటు – రెండు జంటల గందరగోళం : ఫన్నీగా ‘గుడ్‌న్యూస్’ ట్రైలర్

శరద్ కేల్కర్ ఛత్రపతి శివాజీగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు షీలార్ మామ అనే పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా 2020 జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. మంగళవారం (నవంబర్ 19)ట్రైలర్ విడుదల కానుంది. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.. ఫోటోగ్రఫీ : కేయికో నకహర, ఎడిటింగ్ : ధర్మేంద్ర శర్మ, నిర్మాతలు : అజయ్ దేవ్‌గన్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్.