Nag Aswin : క‌ల్కి కోసం నాలుగేళ్లుగా ఒకే చెప్పులు వాడుతున్న నాగ్ అశ్విన్‌.. చెప్పుల ఫోటో రిలీజ్ చేసి..

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా నేడు (జూన్ 27 గురువారం) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Nag Aswin : క‌ల్కి కోసం నాలుగేళ్లుగా ఒకే చెప్పులు వాడుతున్న నాగ్ అశ్విన్‌.. చెప్పుల ఫోటో రిలీజ్ చేసి..

Kalki 2898 AD Director Nag Aswin slippers post viral

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా నేడు (జూన్ 27 గురువారం) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ప్ర‌తి థియేట‌ర్‌లో డార్లింగ్ ఫ్యాన్స్‌ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ అదిరిపోయింద‌ని, క్లైమాక్స్ అయితే మ‌తిపోయింద‌ని అంటున్నారు. తెలుగు సినిమాను మ‌రో లెవ‌ల్‌లో నాగ్ అశ్విన్ నిల‌బెట్టాడు అని అంటున్నారు.

నాగ్ అశ్విన్ క‌ష్టానికి మొత్తానికి ప్ర‌తిఫ‌లం దొరికింది. అన్నీ చోట్ల నుంచి పాజిటివ్ గా స్పంద‌న‌ వ‌స్తుండ‌డంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. అందులో అరిపోయి, చిరిగిపోయిన చెప్పును పోస్ట్ చేశాడు. చాలా కాలంగా ఇవి కొన‌సాగుతున్నాయి అని రాసుకొచ్చాడు.

Kalki Stars : ‘కల్కి’ సినిమాలో చాలా మంది స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్‌లు.. మొత్తం ఎవరెవరు నటించారంటే..?

దాదాపు సినిమా ప్రారంభమైన‌ప్ప‌టి నుంచి నాలుగేళ్లుగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ చెప్పుల‌నే వాడుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అందుక‌నే వీటిని పోస్ట్ చేస్తూ చాలా కాలంగా అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైర‌ల్ కాగా.. నువ్వు గొప్పొడివి సామీ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక క‌ల్కి మూవీ విష‌యానికి వ‌స్తే.. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్.. పలువురు స్టార్ నటీనటులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Kalki 2898 AD Review : ‘కల్కి 2898AD’ మూవీ రివ్యూ.. పుట్టబోయే దేవుడి కోసం యుద్ధం..