Kalki Stars : ‘కల్కి’ సినిమాలో చాలా మంది స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్‌లు.. మొత్తం ఎవరెవరు నటించారంటే..?

కల్కి సినిమాలో నటించిన ముఖ్య నటీనటులు వీళ్ళే..

Kalki Stars : ‘కల్కి’ సినిమాలో చాలా మంది స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్‌లు.. మొత్తం ఎవరెవరు నటించారంటే..?

Prabhas Kalki 2898AD Movie Guest Appearance by Star Actors Full Details Here

Kalki Movies Stars : ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి 2898AD సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా బాగుంది అని టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే బోలెడన్ని లీక్స్ సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. ఇక కల్కి సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటించారని ముందు నుంచి వార్తలు వచ్చాయి. దీంతో సినిమా ఇప్పటికే అనేక షోలు పడటంతో సినిమాలో ఎవరెవరు నటించారో బయటకు వచ్చేసింది.

Also Read : Kalki 2898 AD Review : ‘కల్కి 2898AD’ మూవీ రివ్యూ.. పుట్టబోయే దేవుడి కోసం యుద్ధం..

కల్కి సినిమాలో నటించిన ముఖ్య నటీనటులు వీళ్ళే..

ప్రభాస్
దీపికా పదుకోన్
కమల్ హాసన్
అమితాబ్ బచ్చన్
రాజేంద్ర ప్రసాద్
శోభన
దుల్కర్ సల్మాన్
మృణాల్ ఠాకూర్
అన్నా బెన్
దిశా పటాని
బ్రహ్మానందం
డైరెక్టర్ ఆర్జీవీ
డైరెక్టర్ రాజమౌళి
డైరెక్టర్ అనుదీప్
విజయ్ దేవరకొండ
ఫరియా అబ్దుల్లా
హర్షిత్
పశుపతి
మాళవిక నాయర్

శ్రీనివాస్ అవసరాల
సస్వత ఛటర్జీ

ఇందులో ముఖ్య పాత్రలు కాకుండా.. ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్, ఫరియా అబ్దుల్లా, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల అలా కనిపించి ఇలా వెళ్ళిపోతారు. మృణాల్ ఠాకూర్ ఓ చిన్న పాత్రలో మెప్పిస్తుంది. విజయ్ దేవరకొండ ఎవరూ ఊహించని మహాభారతంలోని ఓ పాత్రలో అదరగొట్టేసాడు. దుల్కర్ సల్మాన్ ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మెప్పిస్తాడు.