Bujji & Bhairava : కల్కి ‘బుజ్జి & భైరవ’ యానిమేషన్ సిరీస్ రివ్యూ.. ప్రభాస్‌ని మరీ ఇంత కామెడీగా చూపించారేంట్రా బాబు..
బుజ్జి, భైరవ పాత్రల గురించి తెలియడానికి ఓ రెండు ఎపిసోడ్స్ ఉన్న యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేశారు కల్కి మూవీ టీమ్.

Kalki 2898AD Bujji and Bhairava Animation Series Review
Bujji & Bhairava Series Review : ప్రభాస్ కల్కి సినిమాతో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అంతకంటే ముందే దీనికి సంబంధించిన ఓ యానిమేషన్ సిరీస్ ని ఇటీవల మే 31న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. బుజ్జి అండ్ భైరవ అనే పేరుతో ఈ సిరీస్ ని రిలీజ్ చేసారు. కల్కిలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ. అలాగే భైరవకు సహకరించే ఓ చిన్ని రోబో పేరు బుజ్జి. ఈ బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బుజ్జి, బుజ్జితో తయారుచేసిన భైరవ వెహికల్ ని గ్రాండ్ లాంచ్ కూడా చేసారు. బుజ్జి, భైరవ పాత్రల గురించి తెలియడానికి ఓ రెండు ఎపిసోడ్స్ ఉన్న యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేశారు.
బుజ్జి & భైరవ యానిమేషన్ సిరీస్ కథ విషయానికొస్తే.. కల్కి కథ ఎలాగో 2898AD సంవత్సరంలో జరుగుతుందని తెలిసిందే. అప్పటి టెక్నాలజీకి తగ్గట్టు లొకేషన్స్, వెహికల్స్, ఆక్సిజన్ మాస్కులు, ఫుడ్ కష్టాలు.. ఇలా ఎస్టాబ్లిష్ చేసారు. కాంప్లెక్స్, శంబాలా మనుషులు అని డబ్బున్నోళ్ళు, లేని వాళ్ళుగా ఉంటారు. బుజ్జి అనే AI రోబో ఎన్నో ఏళ్లుగా ఓ కార్గో వెహికల్ లో పనిచేసిన తర్వాత కాంప్లెక్స్ మెంబర్ ప్రైవేట్ వెహికల్ గా ప్రమోషన్ వస్తుంది. కానీ ఆ కాంప్లెక్స్ ఏరియాలోకి వెళ్లే లోపే ఆ కార్గో వెహికల్ పై దుండగులు దాడి చేయడంతో బుజ్జి వచ్చి స్క్రాప్ లో పడుతుంది. ఇక మరోవైపు కాశీ అనే పట్టణంలో చిన్న చిన్న దొంగతనాలు, రౌడీగా పనిచేస్తూ ఉంటాడు భైరవ. ఎప్పటికైనా బాగా డబ్బు సంపాదించి కాంప్లెక్స్ మెంబర్ అవ్వాలని చూస్తాడు. అలా కాంప్లెక్స్ ఏరియాలోకి వెళ్లాలనుకునే బుజ్జి, భైరవలు ఎలా కలిసారు? వాళ్లిద్దరూ కలిసి స్పెషల్ కార్ ఎలా తయారుచేసారు? భైరవ ఇంటి ఓనర్ బ్రహ్మానందం పాత్ర ఏంటి అనేది సిరీస్ లో చూడాల్సిందే.
Also Read : Rajamouli : రాజమౌళి కొత్త యాడ్ చూశారా? ధైర్యముంటే పార్టిసిపేట్ చేయండి అంటూ..
విశ్లేషణ.. ఈ సిరీస్ తో సినిమాని పిల్లలకు కూడా దగ్గర చేయాలని మూవీ యూనిట్ ట్రై చేస్తుంది. కథ పరంగా కొత్తగానే ఉంది. అయితే కథనం అంతా కామెడీగా చూపించారు. ప్రభాస్ పాత్ర కూడా ఓ కామెడీ హీరోగా చూపించారు. ఏదో సీరియస్ గా చేద్దామని డిసైడ్ అయి అది చివరికి కామెడీ అవ్వడం, భైరవ పాత్రకు నష్టం కలిగించడం లాంటి పాత్రతో భైరవ క్యారెక్టర్ ని చూపించారు. మరి కల్కి సినిమాలో కూడా ప్రభాస్ ని ఇలాగే కామెడీగా చూపిస్తారా? లేదా యానిమేషన్ సిరీస్ వరకే ఇలానా తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. ఇక 2898వ సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉండబోతుంది అని మాత్రం చాలా పక్కాగా ప్లాన్ చేసి చూపించారు. భైరవ ఇంటి ఓనర్ పాత్రలో బ్రహ్మ్మనందం పాత్రని చూపించి నవ్వించారు. ఈ సిరీస్ పిల్లలతో పాటు పెద్దలను కూడా నవ్విస్తుంది. కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే ఉండటం గమనార్హం. తర్వాత మరిన్ని ఎపిసోడ్స్ ఈ బుజ్జి & భైరవ సిరీస్ నుంచి రిలీజ్ చేస్తారేమో చూడాలి. టెక్నికల్ గా యానిమేషన్ అదిరిపోయింది.