Kalki Actor : బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై స్పందించిన కల్కి నటుడు
గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది.

Kalki Actor Saswata Chatterjee Defends Prabhas Amid Arshad Warsis Joker Comment
Kalki Actor Saswata Chatterjee : గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు ప్రధాన కారణం అతడు ఇటీవల ప్రభాస్ లుక్స్ గురించి కామెంట్లు చేయడమే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీలో ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందని ఓ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సి అన్నాడు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతుండగా పలువురు నటులు కూడా అతడికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
కాగా.. తాజాగా దీనిపై కల్కి మూవీలో కమాండర్ మానస్ పాత్రను పోషించిన సస్వతా ఛటర్జీ స్పందించారు. కల్కి మూవీకి ప్రభాస్ ఉత్తమ ఎంపిక అని పేర్కొన్నాడు. “నేను అతని (అర్షద్) గురించి ఏమీ చెప్పదలచుకోలేదు. అది అతడి అభిప్రాయం. నాది కాదు. అసలు విషయానికి వస్తే.. ప్రభాస్ చాలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అసాధారణమైనది. ఈ పాత్రకు అతను ఉత్తమ ఎంపిక. అతను సినిమాలో ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నాడు ”అని ఛటర్జీ అన్నారు.
Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్.. పవర్ స్టార్‌ను కలిసిన నిర్మాత
అర్షద్ వార్సీ కామెంట్లపై ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటులతో పాటు బాలీవుడ్ నటులు స్పందించారు. అలా మాట్లాడడం సరికాదన్నారు. ఇక అభిమానులు అయితే బాలీవుడ్ నటుడి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
అర్షద్ ఏమన్నాడంటే..?
ఓ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సి మాట్లాడుతూ.. ‘కల్కి 2898 AD’ మూవీ చూశానని అయితే తనకు నచ్చలేదన్నాడు. అమితాబ్ బచ్చన్ మాత్రం అశ్వత్థామగా అదరగొట్టాడన్నారు. ఈ వయసులో ఇలా నటించడం చాలా గొప్ప విషయం అని మెచ్చుకున్నాడు. ఆయనకు ఉన్న శక్తితో తనకు కొంచెం అయిన ఉండి ఉంటే ఈ పాటికే లైఫ్ సెట్ అయిపోయేదన్నారు. ఇక మూవీలో ప్రభాస్ పోషించిన పాత్ర బాలేదన్నారు. ఆయన పాత్ర ఓ జోకర్‌లా ఉందన్నారు. తాను ప్రభాస్‌ను మ్యాడ్ మాక్స్ లాంటి మూవీలోని మెల్ గిబ్బన్‌లా చూడాలనుకున్నానని, అయితే చూసింది వేరన్నారు. అర్షద్ వార్సి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి.
Megha Akash : కుర్రాళ్లకు షాక్.. ప్రియుడితో హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైరల్