Kalyaan Dhev : అక్క సీమంతం వేడుకలో కూతురితో కళ్యాణ్ దేవ్..శ్రీజ పోలికలే అంటున్న నెటిజన్లు
శ్రీజ-కళ్యాణ్ దేవ్ కలిసున్నారా? విడిపోయారా? సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. కానీ కళ్యాణ్ దేవ్ కూతురు నవిష్కతో మాత్రం సందడి చేస్తూ కనిపిస్తున్నారు. తాజాగా కళ్యాణ్ దేవ్ ఇంట్లో జరిగిన వేడుకలో నవిష్క కనిపించింది.

Kalyaan Dhev
Kalyaan Dhev : మెగాస్టార్ అల్లుడిగా.. శ్రీజ భర్తగా కళ్యాణ్ దేవ్ సుపరిచితమే. శ్రీజని పెళ్లాడాక సినిమాల్లోకి వచ్చారు కళ్యాణ్ దేవ్. ఇద్దరూ విడిపోయారంటూ టాక్ వచ్చినా వీరిద్దరు కన్ఫామ్ చేసింది లేదు. కానీ కళ్యాణ్ దేవ్ ఎక్కువగా కూతురు నవిష్కతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఇంట్లో జరిగిన ఒక వేడుకలో నవిష్కతో కనిపించారు కళ్యాణ్ దేవ్.
Ram Charan : మహారాష్ట్ర సీఎంతో రామ్ చరణ్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫొటో..
శ్రీజ-కళ్యాణ్ దేవ్ అసలు కలిసి ఉన్నారా? విడిపోయారా? ఈ విషయంపై జనాలకు క్లారిటీ అయితే దొరకలేదు. ఈ జంటకు పెళ్లైన కొన్నేళ్లు రిలేషన్ బాగానే ఉంది. కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం దానికి మెగా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్టే లభించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత శ్రీజ-కళ్యాణ్ దేవ్ మధ్య స్పర్థలు వచ్చాయని.. దూరం పెరిగిందని.. విడిపోయారని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా వీరిద్దరూ కలిసి కనిపించకపోవడం అనుమానాలకు ఊతమిచ్చింది. కానీ ఇప్పటివరకు వీరి బంధంపై ఎవరూ రెస్పాన్డ్ కాలేదు.
విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్, కిన్నెరసాని, సూపర్ మచ్చి సినిమాలు చేసారు. కానీ అవి అంతగా ఆడలేదు. ఆ తర్వాత కళ్యాణ్ సినిమాలకు దూరం అయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉన్న కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కను మిస్ అవుతున్నట్లు పోస్టులు పెట్టేవారు. ఆ తర్వాత తన ఇంట్లో తరచూ నవిష్కతో కలిసి సందడి చేసిన ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తూ వస్తున్నారు. తాజాగా కళ్యాణ్ దేవ్ ఇంట్లో అక్క ఐశ్వర్య సీమంతం వేడుక జరిగింది. ఈ వేడుకలో కళ్యాణ్ దేవ్‌తో కూతురు నవిష్క కనిపించింది. అందరితో కలిసి సందడి చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు.
బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్
కళ్యాణ్ దేవ్, నవిష్క ఫోటోలను చూసిన నెటిజన్లు నవిష్క అచ్చంగా శ్రీజలాగ ఉందని కామెంట్స్ చేసారు. కొంతమంది సినిమాలు చేయమంటూ రిప్లై చేసారు. ఇక మళ్లీ పెళ్లి చేసుకో బ్రో అంటూ సూచనలు కూడా చేశారు. కళ్యాణ్ దేవ్ పోస్టుకు నటి అవికా గోర్ నవ్వు ఎమోజీలను షేర్ చేసింది. కళ్యాణ్ దేవ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram