KH234 : కమల్ హాసన్, మణిరత్నం కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. గూస్‌బంప్స్ అంతే..
కమల్ హాసన్, మణిరత్నం కాంబో దాదాపు 36 ఏళ్ళ తరువాత మళ్ళీ జత కడుతూ చేస్తున్న సినిమా KH234. తాజాగా ఈ మూవీ టైటిల్‌ని..

Kamal Haasan Mani ratnam KH234 Movie titled as Thug Life
కమల్ హాసన్, మణిరత్నం కాంబో ‘నాయకుడు’ వంటి సూపర్ హిట్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి మల్లి మరోసారి కలిసి పని చేయని ఈ ఇద్దరు.. దాదాపు 36 ఏళ్ళ తరువాత ఇప్పుడు మళ్ళీ కలిసి పని చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా? అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
రేపు నవంబర్ 7 కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో.. లోకనాయకుడు నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే ‘భారతీయుడు 2’ సినిమా నుంచి ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ KH234 మూవీ నుంచి కూడా అప్డేట్ ని తీసుకు వచ్చేశారు. సినిమా టైటిల్ తో పాటు మూవీలోని కాస్టింగ్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో జయం రవి, త్రిష నటించబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇక ఈ సినిమాకి ‘థగ్ లైఫ్’ అనే ఇంగ్లీష్ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ తోనే మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు. ఫైట్ సీక్వెన్స్ ని రిలీజ్ చేస్తూ టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. మణిరత్నం టేకింగ్, కే రేవి చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్, కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజన్స్.. ఓవర్ ఆల్ గా టైటిల్ గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. మరి ఆ గ్లింప్స్ ని మీరుకూడా చూసేయండి.
Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ చిత్ర యూనిట్ పిర్యాదు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు..