Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. అధికారిక ప్రకటనతో అదిరిపోయే అప్డేట్..

ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ని ఓ గెస్ట్ రోల్ కి అడుగుతున్నట్టు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. తాజాగా చిత్రయూనిట్ దీన్ని అధికారికంగా ప్రకటించింది.

Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. అధికారిక ప్రకటనతో అదిరిపోయే అప్డేట్..

Kamal Haasan Plays a key role in Prabhas Project K Movie

Updated On : June 26, 2023 / 9:14 AM IST

Project K  :  రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని.. ఇలా బాలీవుడ్ స్టార్స్, మరింతమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ని ఓ గెస్ట్ రోల్ కి అడుగుతున్నట్టు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. తాజాగా చిత్రయూనిట్ దీన్ని అధికారికంగా ప్రకటించింది. భూమి మొత్తాన్ని కవర్ చేసే ఓ నీడ కావాలి మాకు, అది కమల్ హాసన్ అంటూ ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్. దీంతో ప్రాజెక్ట్ K లో కమల్ హాసన్ కూడా నటిస్తున్నారని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అయితే కమల్ గెస్ట్ రోల్ చేస్తున్నారా లేదా విలన్ పాత్ర చేస్తున్నారా అనేది ప్రకటించలేదు.

Bandla Ganesh : మళ్ళీ కాంగ్రెస్‌లోకే బండ్ల గణేష్.. భట్టి విక్రమార్క పాదయాత్రలో బండ్లన్న..

మొత్తానికి ప్రాజెక్ట్ K సినిమాకి మరింత హైప్ తెచ్చారు. ఇప్పటికే అమితాబ్, దీపికా పదుకొనే, దిశా పఠాని.. లాంటి పలువురు స్టార్స్ ఉండగా ఇప్పుడు కమల్ హాసన్ చేరడంతో ప్రాజెక్ట్ K సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు కమల్ హాసన్ అభిమానులు కూడా దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 12 జనవరి 2024 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.