బాలు ఆరోగ్యం అత్యంత విషమం : హాస్పిటల్‌కు చేరుకున్న కమల్..

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 10:25 PM IST
బాలు ఆరోగ్యం అత్యంత విషమం : హాస్పిటల్‌కు చేరుకున్న కమల్..

Updated On : September 24, 2020 / 11:09 PM IST

SPB Health Bulletin-Kamal Haasan went to MGM Hospital: కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది.

‘గత 24 గంటలుగా బాలు ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి విషయంగానే ఉంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందిస్తున్నాం’ అని ఆసుపత్రి వర్గాలు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో సినీ వర్గాలు, బాలు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా బాలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి విశ్వనటుడు కమల్ హాసన్ ఎంజీఎం హాస్పిటల్‌కు వెళ్లారు. బాలు పరిస్థితి గురించి వైద్యులు మరియు బాలు తనయుడు ఎస్పీ చరణ్ తో కమల్ మాట్లాడారు. బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన త్వరగా కోలుకోవాలని కమల్ ఆకాంక్షించారు.