కమ్మ రాజ్యంలో కడప రెడ్లు – క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు నుండి క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 27, 2019 / 05:39 AM IST
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు – క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

Updated On : May 28, 2020 / 3:43 PM IST

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు నుండి క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ రిలీజ్..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే బ్రహ్మ ముహూర్తంలో తన కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ నుండి ‘క్యాస్ట్ ఫీలింగ్’ సాంగ్ రిలీజ్ చేశాడు. ఈ పాటను క్యాస్ట్ ఫీలింగ్ లవర్స్ అందరికీ అంకితమిచ్చాడు కూడా.. ‘నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది.. అలా ఉండడం నేను చాలా గర్వంగా ఫీలవుతాను..

‘క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం చాలా వేరే ఫీలింగులనకన్నా చాలా చాలా బెటర్ ఫీలింగ్ అని నా ఫీలింగ్.. ఎవరి కులం మీద వాళ్ల కున్న ప్రేమని కులగజ్జి అనే ఒక పరమ నీచ అసహ్యమైన పేరుతో వర్ణించే వాళ్లకి ఇదే నా సమాధానం’.. అంటూ వర్మ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ స్టార్ట్ చేశాడు.

Read Also : ఇట్స్ గేమ్ ఓవర్ : వార్ – ట్రైలర్..

కులం పేరుతో రాజకీయాలు చేసే వాళ్లని అడిగి కడిగి పారేస్తూ.. తనకీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పాడు. సినిమాలో సందర్భానుసారంగానే ఈ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ పెట్టినట్టు చెప్పాడు. రవిశంకర్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. వర్మ ఆస్థాన కవి సిరాశ్రీ లిరిక్స్ రాసాడు.. వర్మ మరోసారి తన మధురమైన గాత్రంతో తన స్టైల్‌లో పాడాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో వర్మ ఇంకెన్ని కాంట్రవర్శీలు క్రియేట్ చేస్తాడో చూడాలి..