రెండో భర్తతో రొమాన్స్.. అతను దొరకడం అదృష్టం అంటున్న ప్రముఖ నటి..
ప్రముఖ టీవీ నటి కామ్యా పంజాబీ తన రెండో భర్తతో ముద్దూ ముచ్చట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది..

ప్రముఖ టీవీ నటి కామ్యా పంజాబీ తన రెండో భర్తతో ముద్దూ ముచ్చట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది..
హిందీ సీరియల్స్ రెగ్యలర్‌గా ఫాలో అయ్యే వాళ్లకి కామ్యా పంజాబీ పరిచయం ఉండే ఉంటుంది. ఆమె ఎక్కవగా వ్యాంప్, నెగెటివ్ రోల్స్‌తో పాపులర్ అయింది. ఫేమస్ టీవీ యాక్ట్రెస్ కామ్యా పంజాబీ తన రెండో భర్త షాలబ్ డాంగ్‌తో ముద్దూ ముచ్చట్లాడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెలరోజుల వివాహ వార్షికోత్సవం జరుపుకుంది.
వీరిద్దరు ఫిబ్రవరి 9వ తేదీన మెహందీ వేడుకను నిర్వహించి, పదో తేదీన పెళ్లి చేసుకున్నారు. ‘‘నేను ఎంతో అదృష్టవంతురాలిని. షాలాబ్ డాంగ్, ఐ లవ్ యూ.’’ అంటూ కామ్యా పంజాబీ తన భర్త ముద్దు ఇస్తున్న పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
కామ్యాకు గతంలో బిజినెస్‌మెన్ బంటీ నెగితో పెళ్లైంది. ఆమెకు పది సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. 40 ఏళ్ల వయసుగల కామ్యా గత ఏడాది ఫిబ్రవరిలో ఓ స్నేహితుడి ద్వార షాలబ్ డాంగ్‌ను కలిసింది. అనంతరం షాలబ్ నచ్చడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బిగ్‌బాస్ షో ఏడవ సీజన్లో కామ్యా పంజాబీ పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం తన భర్తతో రొమాన్స్‌లో మునిగి తేలుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.