భయపెట్టడానికి రెడీ అవుతున్న కాంచన-3

లారెన్స్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కాంచన-3 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

  • Published By: sekhar ,Published On : January 9, 2019 / 08:08 AM IST
భయపెట్టడానికి రెడీ అవుతున్న కాంచన-3

Updated On : January 9, 2019 / 8:08 AM IST

లారెన్స్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కాంచన-3 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఫేమస్ కొరియోగ్రాఫర్ లారెన్స్ డైరెక్షన్‌లో వచ్చిన ముని సిరీస్ సినిమాలు ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. నవ్విస్తూ, భయపెడుతూ, చివరికి ఒక మెసేజ్ ఇస్తూ రూపొందిన ముని, కాంచన, గంగ సినిమాలకు కొనసాగింపుగా, ఇప్పుడు కాంచన-3 రాబోతుంది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, లారెన్స్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నాడు. రీసెంట్‌గా కాంచన-3 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. నెరిసిన జుట్టు, గెడ్డం, తెల్ల పంచె, కుర్తా, మెడలో, చేతికి రుద్రాక్షలు, ఎటువంటి ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నాడో అర్థం కాకుండా కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, చైర్‌లో కూర్చుని ఉన్న లారెన్స్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.

నిక్కీ థంబోలీ, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్న కాంచన-3 షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు కాంచన సిరీస్‌లో వచ్చిన సినిమాల కంటే బెటర్‌గా కాంచన-3 ఉండబోతుందని తెలుస్తుంది. దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కాంచన-3, ఎప్రిల్ 18న, తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
ఈ సినిమాకి కెమెరా : వెట్రి, సర్వేష్ మురారి, ఎడిటింగ్ : రూబన్, ఫైట్స్ : సూపర్ సుబ్బరాయన్