Emergency : ఇందిరా అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిరా.. ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ గ్లింప్స్..
ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

Kangana Ranaut Emergency Release Date Announcement video
Emergency : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వరుస సినిమాలను లైన్ పెడుతుంది. ఇటీవల చంద్రముఖి 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ భామ.. తేజస్, ఎమర్జెన్సీ సినిమాలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్స్ కి సిద్ధం చేస్తుంది. కొన్ని రోజులు క్రితం ‘తేజస్’ త్రిల్లర్ రిలీజ్ చేసి విడుదల తేదీని కన్ఫార్మ్ చేసిన కంగనా.. ఇప్పుడు ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ మూవీని కంగనానే దర్శకురాలిగా మరి తెరకెక్కిస్తోంది.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన ‘ఎమర్జెన్సీ’ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆ టైములో జరిగిన ప్రతిపక్షాల అరెస్టులు, టెలివిజన్, రేడియో బంద్ చేయడం, ఆర్డర్స్ అతిక్రమించిన ప్రజలను దారుణంగా శిక్షించడం, ఎన్నో మరణాలు.. ఇలా అన్ని సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఒక చిన్న గ్లింప్స్ తో కంగనా తెలియజేసింది. ఇక గ్లింప్స్ చివరిలో కంగనా.. ‘ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా’ అని చెప్పే డైలాగ్ వైరల్ గా మారింది. ఈ మూవీని నవంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Also read : Amardeep Mother : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధింపులు.. బాధతో అమర్ దీప్ తల్లి వీడియో..
ఈ సినిమాలో కంగనా ‘ఇందిరా గాంధీ’గా, అనుపమ్ ఖేర్ ‘లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్’ పాత్రని, శ్రేయాస్ తల్పడే ‘అటల్ బిహారి వాజపేయి’గా కనిపించబోతున్నారు. మరి ఈ సినిమాతో కంగనా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. కాగా కంగనా నటిస్తున్న ‘తేజస్’ మూవీ అక్టోబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కంగనా.. ఫైర్ జెట్ పైలెట్ గా కనిపించబోతుంది. URI సినిమాని డైరెక్ట్ చేసిన సర్వేశ్ మెవరా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.