Mumbai Airport : కంగనా నువ్వేమన్నా స్పెషలా?.. నెటిజన్లు ఫైర్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాస్క్ లేకుండా విమానాశ్రయంలోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Mumbai Airport
Mumbai Airport : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షికంగా కరోనా నిబంధనలు పాటిస్తున్నాయి. సామాజిక దూరం, మాస్క్ తప్పనిసరని పదే పదే చెబుతున్నాయి. అయిన కొందరు మాత్రం అవేవి పట్టించుకోకుండా తాము స్పెషల్ అన్నట్లు తిరుగుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కంగనా కూడా అదే విధంగా వ్యవరించింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన కంగనా మాస్క్ లేకుండానే లోపలికి వెళ్ళింది. వెళ్లేముందు ‘నో మాస్క్ నో ఎంట్రీ’ అని రాసి ఉన్న బోర్డు పక్కనే నిల్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది.. ఇక ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More : Uttej Emotional Words : ‘చాలా నొప్పిగా ఉంది పద్దూ’.. కంటతడి పెట్టిస్తున్న ఉత్తేజ్ మాటలు..
ఈ ఫోటోలు, వీడియో చూసిన నెటిజన్లు కంగనాపై మండిపడుతున్నారు. సెలెబ్రిటీ అయి ఉండి ఇలా నిబంధనలు అతిక్రమించడం ఏంటని, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి రాజకీయ నాయకులతో కంగనను పోల్చారు. ఎన్నికల తర్వాత ఎలా అయితే రాజకీయ నాయకులు ఓటర్లను పట్టించుకోరో, కంగనా కూడా నియమాలను విస్మరించింది అంటూ దుయ్యబట్టారు. సెక్యూరిటీ సిబ్బందిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు, సామాన్య ప్రజలపై కఠిన ఆంక్షలు పెట్టే సిబ్బంది కంగనా విషయంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More : Sreeleela : దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ హీరోయిన్ శ్రీలల ఫొటోస్..
View this post on Instagram