Kangana Ranaut : ఏకంగా లోక్‌సభ సెక్రటేరియట్ లోనే షూటింగ్‌కి అనుమతి కోరిన కంగనా.. అనుమతిస్తారా??
ప్రస్తుతం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో 'ఎమర్జెన్సీ' అనే సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకి కంగనానే నిర్మాత, దర్శకురాలిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ వివిధ పరిసరాల్లో జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి...........

Kangana Ranaut request permission for movie shoot at loksabha secretariat
Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన సినిమాలతోనే, తన వ్యాఖ్యలతోనో ఏదో ఒక విధంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కాంట్రవర్సీలలో ఉంటూనే దేశం కోసం, ధర్మం కోసం ఎంతవరకు అయినా ఎదురెళ్లి పోరాడుతుంది ఈ బాలీవుడ్ భామ. ఇటీవల ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది కంగనా.
ప్రస్తుతం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకి కంగనానే నిర్మాత, దర్శకురాలిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ వివిధ పరిసరాల్లో జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి లోక్‌సభ సెక్రటేరియట్ ముందు షూట్ చేస్తాము, పర్మిషన్ కావాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉన్నతాధికారులకు లేఖ రాసింది.
Mrunal Thakur : మనకి ఎంత రెమ్యునరేషన్ కావాలో మనం అడగాలి.. అస్సలు మొహమాట పడకూడదు..
దీంతో కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు లోక్‌సభ సెక్రటేరియట్ లో గాని, ఆ చుట్టూ పక్కల పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తుల వీడియో, కెమెరాలకు ప్రవేశం లేదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన దూరదర్శన్ వాళ్లకి మాత్రమే అనుమతి ఉంది. మరి కంగనా అడిగిన రిక్వెస్ట్ ని ఒప్పుకొని రూల్స్ బ్రేక్ చేసి లోక్‌సభ సెక్రటేరియట్ ముందు షూటింగ్ కి అనుమతిస్తారా అని అందరూ సందేహిస్తున్నారు. అయితే అనుమతి ఇచ్చే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.