Kangana Ranaut : పెళ్లి చేసుకోబోతున్న కంగనా.. మీడియాకి వెడ్డింగ్ కార్డు.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పెళ్లి చేసుకోబోతుందా? తన ఇన్‌స్టాగ్రామ్ లో కంగనా చేసిన ఒక వీడియో పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Kangana Ranaut wedding card to media Tiku Weds Sheru

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ ఉంటుంది. సినీ మరియు సామజిక సమస్యలు పై సంచలన పోస్ట్ లు వేస్తూ నిత్యం మీడియాలో నిలుస్తుంటుంది. ఇక తాజాగా కంగనా.. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె చేసిన ఒక వీడియో పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కంగనా కారులో వసుంటే.. మీడియా ప్రతినిధులు ఆమె కారుని చుట్టుముట్టి ప్రశ్నించడం మొదలు పెట్టారు. వారిలో ఒక విలేకరి.. కంగనా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని ప్రశ్నించాడు.

Shah Rukh Khan : నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ పెడతావా అన్నందుకు.. షారుఖ్ ఇంటికి ఫుడ్ డెలివరీస్!

దానికి కంగనా బదులిస్తూ.. అవును నిజమే అంటూ మీడియాకి వెడ్డింగ్ కార్డుని కూడా ఇచ్చింది. అయితే ఆ కార్డులో కంగనా పేరు కాకుండా ‘టిక్కు వెడ్స్ షేరు’ అని ఉంది. అది చూసిన తరువాత గాని అర్ధంకాలేదు. ఇదంతా ఒక మూవీ ప్రమోషన్ కోసం చేసిన పని అని. అసలు విషయం ఏంటంటే కంగనా.. టిక్కు వెడ్స్ షేరు (Tiku Weds Sheru) సినిమాని నిర్మిస్తుంది. ఆ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాయి కబీర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.

Shah Rukh Khan : బాలీవుడ్‌ ఇతర హీరోల దగ్గర లేనివి తన దగ్గర ఉన్నవి అవే అంటున్న షారుఖ్.. ట్వీట్ వైరల్!

జూన్ 23న విడుదలకు సిద్దమవుతుండడంతో నిర్మాత అయిన కంగనా స్వయంగా ప్రమోట్ చేస్తుంది. ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎమర్జెన్సీ (Emergency) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో కంగనా.. ఒకప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ (Indira Gandhi) పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంతో పాటు చంద్రముఖి 2 (Chandramukhi 2) సినిమాలో కూడా నటిస్తుంది. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కంగనా చంద్రముఖి పాత్రలో కనిపించబోతుంది.