Kangana Ranaut: తాలిబాన్లపై పోస్ట్ చేశా.. చైనా నుండి ఇన్‌స్టా హ్యాక్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పుడు సంచలన కామెంట్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసినట్లు కంగనా ఇన్ స్టాగ్రామ్ నుండే పోస్ట్ పెట్

Kangana Ranaut: తాలిబాన్లపై పోస్ట్ చేశా.. చైనా నుండి ఇన్‌స్టా హ్యాక్!

Kangana Ranaut

Updated On : August 18, 2021 / 5:55 PM IST

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పుడు సంచలన కామెంట్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసినట్లు కంగనా ఇన్ స్టాగ్రామ్ నుండే పోస్ట్ పెట్టింది. చైనా నుండి తన ఇన్ స్టా ఖాతాను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా మంగళవారం రాత్రి తనకు అలెర్ట్ వచ్చిందని.. అయితే బుధవారం ఉదయం లేచి చూస్తే తన అకౌంట్ కనిపించలేదని పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)


తన ఖాతా కనిపించడం లేదని ఇన్‌స్టాగ్రామ్‌ వారికి ఫిర్యాదు చేసిన అనంతరం మళ్లీ నా అకౌంట్‌ తిరిగి వచ్చింది.. కానీ తన ఖాతా నుండి ఏదైనా రాసే క్రమంలో లాగ్‌ఆఫ్‌ అవుతుంది. అందుకే నా సోదరి ఫొన్‌ నుంచి నా అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఈ స్టోరీ పెడుతున్నానని పేర్కొంది. ఇదంతా ఓ అంతర్జాతీయ కుట్రగా పేర్కొన్న కంగనా అసలు నమ్మశక్యంగా లేదని పేర్కొంది.

స్వదేశంతో పాటు అంతర్జాతీయంగా ప్రతి అంశంపై స్పందించే కంగనా బాలీవుడ్ లో సివంగిగా విరుచుపడుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నేపాటిజం దగ్గర నుండి వ్యవసాయ చట్టాల వరకు ప్రతి అంశంపై ముక్కుసూటిగా తన వాదనను వినిపించే కంగనా.. ఈ మధ్య మరింత గ్లామరస్ గా ఫోటో షూట్లు చేసి నెటిజన్లతో షేర్ చేసుకుంటుంది. అయితే.. చివరికి ఆ ఫోటోలు కూడా వివాదాస్పదం కావడం విశేషం.