కనికా కపూర్ డిశ్చార్జ్ ..ఇబ్బందులు తప్పవా

బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆరోసారి ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో నెగటివ్ అని తేలింది. దీంతో లక్నో లోని సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
గత శనివారం ఐదోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యగా మరసారి పరీక్ష నిర్వహించారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే..ఆమెను ఇంటింకి పంపించారు. ఇంటికి వెళ్లాక పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆస్పత్రి వైద్యులు ఆమెకు సూచించారు. డిశ్చార్జ్ అయినా..ఆమెకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఆమెపై మూడు ఎఫ్ఐఆర్ లు ఉన్నట్టు సమాచారం.
విదేశాల నుంచి వచ్చిన తర్వాత స్వీయ నిర్భందంలోనే ఉండాలనే నిబంధన ఆమె పాటించలేదు. వైరస్ సోకినా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం, సామాజిక దూరం పాటించలేదు. అంతేగాకుండా ఈమె పలు సోషల్ ఈవెంట్లకు హాజరయ్యారు. దేశంలోనే కరోనా సోకిన బాలీవుడ్ తొలి సెలబ్రెటీ కనికా కపూర్ కావడం గమనార్హం. తన ఆల్బమ్ విడుదల కోసం మార్చి నెల ప్రారంభంలో లండన్ నుంచి ముంబాయికి వచ్చారు.
తల్లిదండ్రుల పిలుపు మేరకు ఆమె ఇండియాకు చేరుకుని కొన్ని పార్టీలకు సైతం హాజరయ్యారు. జలుబు, జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లగా కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. మరి దాఖలైన కేసులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. (సమంత, త్రిష ప్రైవేట్ పార్టులపై శ్రీరెడ్డి సెటైర్)