Comedian: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
ప్రముఖ కన్నడ హాస్యనటుడు శంకర్ రావు కన్నుమూశారు.

Shankar
Comedian: ప్రముఖ కన్నడ హాస్యనటుడు శంకర్ రావు కన్నుమూశారు. సోమవారం బెంగళూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 88 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో శంకర్ రావు చనిపోయారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రముఖ హీరోల పక్కన వందకు పైగా కన్నడ సినిమాల్లో నటించారు శంకర్ రావు.
విష్ణువర్ధన్‌తో పాటు శంకర్ రావు శంకర్ నాగ్, అనంత్ నాగ్, లోకేష్, శ్రీనాథ్, ద్వారకీష్, శివరాజ్ కుమార్, రవిచంద్రన్, రమేష్ అరవింద్, ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్, దర్శన్ వంటి ఎందరో అగ్రశ్రేణి స్టార్లతో ఆయన నటించారు. రంగస్థలంలో కూడా నాటకాల్లో రాణించారు శంకర్ రావు.
‘యారా సాక్షి’ సినిమాతో శాండల్‌వుడ్‌లో అరంగేట్రం చేసిన శంకర్ రావు.. ప్రముఖ కన్నడ టీవీ సీరియల్స్‌లో కూడా కనిపించారు. శంకర్ రావు మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.