Pradeep Raj : కరోనాతో ప్రముఖ డైరెక్టర్ మృతి

తాజాగా కరోనాతో ప్రముఖ కన్నడ డైరెక్టర్‌ ప్రదీప్‌ రాజ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స...............

Pradeep Raj : కరోనాతో ప్రముఖ డైరెక్టర్ మృతి

Pradeep Raj

Updated On : January 21, 2022 / 7:41 AM IST

Pradeep Raj :  ఇటీవల థర్డ్ వేవ్ మొదలయ్యాక మళ్ళీ రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కరోనాతో ప్రముఖ కన్నడ డైరెక్టర్‌ ప్రదీప్‌ రాజ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అతనికి మధుమేహం కూడా ఉండటంతో ఆరోగ్యం మరింత క్షీణించి చికిత్స పొందుతూనే గురువారం తుదిశ్వాస విడిచారు.

Meera Jasmine : సీనియర్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ.. ఒక్కరోజులోనే లక్షకు పైగా ఫాలోవర్స్..

ప్రదీప్‌ రాజ్‌ మరణ వార్త తెలిసి కన్నడ సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు. కన్నడ స్టార్‌ హీరో యశ్‌తో కలిసి ఆయన ‘కిరాతక’ సినిమాని తెరకెక్కించారు. అంతేకాక రజినికంత, అంజదగండు, బెంగళూరు 560023 .. లాంటి సినిమాలని తెరకెక్కించారు. యశ్ తో కలిసి ఈ ఏడాది కిరాతక-2 సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతలోనే ఇలా కోవిడ్‌ బారిన పడి ఆయన మరణించడం కన్నడ సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.