Kannada Heroins : సినీ పరిశ్రమలలో కన్నడ హీరోయిన్స్ హవా.. ఏలేస్తున్న సీనియర్స్, జూనియర్స్..
ప్రతి సినీ పరిశ్రమలోనూ ఎప్పుడూ కన్నడ హీరోయిన్స్ దే హవా నడుస్తుంది. గతంలో ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి, సౌందర్య ఆ టైం నుంచి మొన్న అనుష్క శెట్టి వరకు, ఇప్పుడు పూజ హెగ్డే, కృతి శెట్టి వరకు............

Kannada Heroins
Kannada Heroins : ప్రతి సినీ పరిశ్రమలోనూ ఎప్పుడూ కన్నడ హీరోయిన్స్ దే హవా నడుస్తుంది. గతంలో ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి, సౌందర్య ఆ టైం నుంచి మొన్న అనుష్క శెట్టి వరకు, ఇప్పుడు పూజ హెగ్డే, కృతి శెట్టి వరకు కూడా అన్ని పరిశ్రమలలో కన్నడ భామల హవానే నడుస్తుంది. కర్ణాటక, ముఖ్యంగా మంగుళూరు నుంచి ఎక్కువగా హీరోయిన్స్ వస్తారు, వస్తున్నారు. ఒకప్పుడు కన్నడ భామలు దేశ సినీ పరిశ్రమని రూల్ చేశారు. ఆ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు సినీ పరిశ్రమలో కన్నడ భామల హవా మొదలైంది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ వరకు సత్తాచాటుతూ ఇండియా వైడ్ హల్చల్ చేసే పనిలో బిజీ అవుతున్నారు కన్నడ ముద్దు గుమ్మలు.
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలోనే టాలీవుడ్ లోకి నక్కతోక తొక్కి వచ్చింది. ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ సినిమా హిట్ అవడంతో ఫస్ట్ సినిమాతోనే ఇక్కడ బ్రేక్ వచ్చేసింది. ఆతర్వాత వచ్చిన గీతాగోవిందం, డియర్ కామ్రెడ్, భీష్మ, సరిలేరు నీకెవ్వరు లాంటి మూవీస్ చేసిన రష్మికకు పుష్ప ఆఫర్ తో బూరెల బుట్టలో పడ్డట్టయింది. పుష్పతో శ్రీవల్లికి ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం రష్మిక కోలీవుడ్ స్టార్ విజయ్ తో బైలింగ్వల్ సినిమా వారసుడు, బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను, అమితాబచ్చన్ తో కలసి గుడ్ బై, రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూస్తోంది.
Janhvi Kapoor : జాన్వీకి స్టార్ హీరోయిన్ హోదా వద్దా?
ఇక పూజా హెగ్డే తెలుగులో ఒకలైలా కోసం సినిమాతో పరిచయమైనా, వెంటనే ముకుందా చేసి, తెలుగులో తన అందం, అభినయానికి మంచి గుర్తింపు దక్కించుకుంది. దువ్వాడ జగన్నాథం సినిమాతో టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరసగా ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేశ్ బాబుతో మహర్షి, అల్లుఅర్జున్ తో అల వైకుంఠపురంలో చేసిన జిగేలు రాణి రాధేశ్యామ్ తో ప్రభాస్ సరసన నటించి టాప్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరసగా ఆఫర్స్ కొట్టేస్తోంది. అటు బాలీవుడ్ లో 2017లోనే మొహంజదారో చేసిన పూజాహెగ్డే అక్కడ నిలబడ లేక తెలుగులోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో సర్కస్ , సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దివాళి చేస్తోంది. ఇప్పుడు మరోసారి మహేశ్ బాబుతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసేందుకు రెడీ అవుతుంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సరసన జనగణమన కూడా చేస్తూ ఇలా మూడు ఇండస్ట్రీస్ ను కవర్ చేస్తూ టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది పూజా హెగ్డే.
మిస్ కన్నడ 2015 టైటిల్ విన్నర్ శ్రీనిధి శెట్టి 2016లో మిస్ దివ సూపర్ నేషనల్ గా ఎంపికైంది. కెజిఎఫ్ తో కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కేజిఎఫ్ కన్నడ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కావడంతో ఒకే ఒక్క సినిమాతో ఇండియా వైడ్ పాపులరిటి సంపాధించుకుంది శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం విక్రమ్ సరసన ఆమె నటిస్తున్న తమిళ మూవీ కోబ్రా కూడా పాన్ఇండియా మూవీగా రానుంది.
Pratap Pothen : ప్రముఖ దర్శక నటుడు కన్నుమూత.. విషాదంలో సౌత్ సినీ పరిశ్రమ..
ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న కన్నడ హీరోయిన్ కృతిశెట్టి. హిందీలో సూపర్ 30 సినిమాలో చిన్న రోల్ లో చేసి తెలుగులో ఉప్పెనతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఫస్ట్ సినిమాతోనే తెలుగులో సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత నానితో శ్యామ్ సింగరాయ్, చైతూతో బంగార్రాజు వరుసగా హిట్ కొట్టింది. తాజాగా ఆరాం తో వారియర్ సినిమాలో మెప్పించిన కృతి వెంకట్ ప్రభు డైరెక్షన్ లో మళ్ళీ చైతూతో తమిళ్, తెలుగు సినిమాతో పాటు నితిన్ మాచర్ల నియోజకవర్గం, తమిళ్ స్టార్ సూర్య సరసన బాల డైరెక్షన్ లో ఓ సినిమా, సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది కృతి.
మరో కన్నడ గ్లామర్ డాల్ శ్రీలీల కన్నడలో సినిమాలు చేసి బెస్ట్ ఫీమేల్ డెబ్యూ యాక్టర్ కేటగిరీలో సైమా అవార్డ్ కూడా కొట్టేసింది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమాతో తెలుగులో వరస ఛాన్సులు కొట్టేస్తుంది. తెలుగులో రవితేజ సరసన ధమాకా, నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఒకరాజు, వైష్ణవ తేజ్ నాలుగో సినిమాలో ఛాన్సులు కొట్టేసింది. ఇవే కాక రెండు కన్నడ సినిమాలు కూడా ఓకే చేసుకుంది. శ్రద్ధా శ్రీనాథ్, నభా నటేష్.. ఇంకా పలువురు కన్నడ భామలు అన్ని పరిశ్రమలలో దూసుకుపోతున్నారు. అప్పుడూ, ఇప్పుడూ హీరోయిన్స్ అంటే కర్ణాటకనే గుర్తొస్తుంది సినీ వర్గాలకి.