Janhvi Kapoor : జాన్వీకి స్టార్ హీరోయిన్ హోదా వద్దా?

అసలు ఏమాత్రం కష్టపడకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సిస్తామంటే లైట్ తీసుకుంటూ పెద్దగా స్టార్ టచ్ లేని సినిమాలు చేసుకుంటోంది జాన్వికపూర్. అసలు ఈ అతిలోక సుందరి కూతురి.............

Janhvi Kapoor : జాన్వీకి స్టార్ హీరోయిన్ హోదా వద్దా?

Janhvi

Janhvi Kapoor :  హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఎవరికైనా స్టార్ హీరోయిన్ అవ్వాలనేదే ఎయిమ్. దానికోసం నానా తంటాలు పడి అక్కడా ఇక్కడా అవకాశాలు సంపాదించుకుని ఆఖరికి ఎప్పటికో అనుకున్నది సాధిస్తారు కొంతమంది. కానీ అసలు ఏమాత్రం కష్టపడకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సిస్తామంటే లైట్ తీసుకుంటూ పెద్దగా స్టార్ టచ్ లేని సినిమాలు చేసుకుంటోంది జాన్వికపూర్. అసలు ఈ అతిలోక సుందరి కూతురి ఆంతర్యం ఏంటో? జాన్వికపూర్ స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీఇచ్చినా ఇప్పటి వరకూ భారీ సినిమాలు చెయ్యనే లేదు. ఏదో ఒకటీ అరా సినిమాలు చేసినా అవి స్టార్ హీరోయిన్ అనిపించుకునేంత రేంజ్ లో ఉన్నవి కాదు. గ్లామర్ హీరోయిన్ అనిపిస్తూనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టెయ్యాల్సిన జాన్వి ట్రెడిషనల్ రోల్స్ చేస్తూ జస్ట్ హీరోయిన్ గానే మిగిలిపోతోంది.

జాన్వి కపూర్ లేటెస్ట్ గా ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన నయనతార నెట్రికన్ మూవీని రీమేక్ గా చేసిన జాన్వికపూర్. ఈ సినిమాని కూడా ఏమాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సో కాల్డ్ నార్మల్ మూవీగానే చేసింది. అంతేకాదు ఈ సినిమాని ధియేటర్లోకాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తోంది. ఇప్పటి వరకు జాన్వి చేసిన సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ కి తగిన సినిమా ఒక్కటి కూడా లేదంటే జాన్వి స్టార్ స్టేటస్ ని అర్దం చేస్కోవచ్చు.

Pratap Pothen : ప్రముఖ దర్శక నటుడు కన్నుమూత.. విషాదంలో సౌత్ సినీ పరిశ్రమ..

యాక్టింగ్ వైజ్ బెటర్ గా ఉన్నా జాన్వి మాత్రం సో కాల్డ్ హీరోయిన్ గానే మిగిలిపోతోంది. బాలీవుడ్ లో చిన్న హీరోలతో చిన్న సినిమాలు చేస్తున్న జాన్వికి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్, బోనీకపూర్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కూతురిగా ఉన్నా ఏమాత్రం స్టార్ సినిమాలకి ఓకే చెప్పట్లేదు. స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండతో హీరోయిన్ గా ఛాన్సులొస్తున్నా జాన్వి మాత్రం లైట్ తీసుకుంటోంది. కమర్షియల్ సినిమాలు కాకుండా మాములు సినిమాలే చేస్తుండటంతో జాన్వికి స్టార్ హీరోయిన్ హోదా వద్దా అని ఆలోచిస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు. మరి ఫుల్ రేంజ్ లో స్టార్ హీరోతో జాన్వీ కమర్షియల్ సినిమా ఎప్పుడు చేస్తుందో చూడాలి.