Pratap Pothen : సీనియర్ నటి రాధిక మాజీ భర్త, ప్రముఖ దర్శక నటుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూత..

తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ప్రతాప్ పోతెన్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు తెరకెక్కించారు. 70 ఏళ్ళ వయసులో కూడా ఆయన.........

Pratap Pothen : సీనియర్ నటి రాధిక మాజీ భర్త, ప్రముఖ దర్శక నటుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూత..

Pratap Pothe

Updated On : July 15, 2022 / 12:34 PM IST

Pratap Pothen :  తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ప్రతాప్ పోతెన్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు తెరకెక్కించారు. 70 ఏళ్ళ వయసులో కూడా ఆయన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. తాజాగా గుండెపోటుతో 70 ఏళ్ళ వయసులో ప్రతాప్ పోతెన్ మరణించారు.

Vikram K Kumar : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్ ఉంటుంది.. డైరెక్టర్ విక్రమ్ ప్రకటన..

తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో దాదాపు 100కుపైగా సినిమాల్లో నటించారు ప్రతాప్. తెలుగులో ఆకలి రాజ్యం, కాంచన గంగ, మరో చరిత్ర, వీడే వాడు లాంటి పలు సినిమాల్లో నటించారు. డైరెక్టర్ గా కూడా దాదాపు 10 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రాధికను 1985లో పెళ్లి చేసుకున్న ప్రతాప్‌1986లో విడాకులిచ్చారు. ఆ తర్వాత అమల అనే మరొకరిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడతో కూడా 2012 లో విడాకులు తీసుకున్నారు. సీనియర్ దర్శక నటుడైన ప్రతాప్ పోతెన్ మరణించడంతో పలువురు సౌత్ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.