Puneeth Rajkumar : ‘అప్పూ’ సార్…మళ్లా రారా ? ఫ్యాన్స్ కన్నీళ్లు..వీడియో వైరల్

అభిమానులను సర్ ఫ్రైజ్ చేసిన ఈ వీడియో అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తోంది. అప్పూ..మళ్లా రారా అంటూ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Puneeth Rajkumar : ‘అప్పూ’ సార్…మళ్లా రారా ? ఫ్యాన్స్ కన్నీళ్లు..వీడియో వైరల్

Puneeth

Updated On : October 30, 2021 / 4:36 PM IST

Kannada Power Star : పునీత్ రాజ్‌కుమార్.. కన్నడ సినీ పరిశ్రమలోనే కాకుండా యావత్ దేశం తలుచుకుంటున్న పేరు. 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో హఠాత్మరణం చెందారు. లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్,  పార్వతమ్మ కుమారుడు పునీత్ రాజ్‌కుమార్‌. తెరపై తన అసాధారణమైన పాత్రలతో పునీత్ దక్షిణాదిలో తనకంటూ భారీ అభిమానులను సృష్టించుకున్నాడు. ఆయన లేరన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ…కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా..సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో అభిమానులను సర్ ఫ్రైజ్ చేసిన ఈ వీడియో అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తోంది. అప్పూ..మళ్లా రారా అంటూ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Read More : కంటతడి పెట్టిన బాలకృష్ణ _ Balakrishna Emotional _ Puneeth Rajkumar Final Rites

పునీత్ రాజ్ కుమార్ కు  యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. అందుకే ఆయన్ను అభిమానులు పవర్ స్టార్ అంటూ పిలుచుకుంటుంటారు. అభిమానులంటే…పునీత్ కు ఎనలేని గౌరవం. చూడటానికి వచ్చిన వారిని ఏ మాత్రం నిరాశ చెందకుండా..వారితో మాట్లాడే వారు. గత సంవత్సరం వచ్చిన ‘యువరత్న’ సినిమా కోసం చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేసింది. పునీత్ నటన, ఆయన ఎలా ఉంటారు ? ఆయన సినిమాలు ఎలా ఉంటాయనే దానిపై అభిమానులతో మాట్లాడించే వారు.

Read More : Puneeth Rajkumar : బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగం..

తెర వెనుక నుంచి పునీత్ వచ్చేవారు. ఈ విషయం ముందున్న వాళ్లకు తెలియదు. అలాగే మాట్లాడుతుండే వారు. హఠాత్తుగా పునీత్ ప్రత్యక్షమయ్యే వారు. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి, షాక్ కు గురయ్యే వారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు కూడా అలాగే ఎక్కడి నుంచైనా తమ అభిమాన నటుడి తిరిగి వస్తుండే బాగుండు..అని సోషల్ మీడియాల ద్వారా వేడుకుంటున్నారు.