Kapil Sharma : కోట్లు రెమ్యూనరేషన్ నుండి.. జీరో బ్యాంక్ బ్యాలెన్స్.. నిర్మాతగా మరి టీవీ యాక్టర్ కష్టాలు..

Kapil Sharma : కోట్లు రెమ్యూనరేషన్ నుండి.. జీరో బ్యాంక్ బ్యాలెన్స్.. నిర్మాతగా మరి టీవీ యాక్టర్ కష్టాలు..

Kapil Sharma 5 crore remuneration per episode from zero bank balance

Updated On : October 25, 2024 / 2:24 PM IST

Kapil Sharma : టాప్ కమెడియన్లలో ఒకరైన కపిల్ శర్మకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కమెడియన్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ ఒక్కో ఎపిసోడ్ కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడు. భారీగా ఆస్తులు కూడా కూడబెట్టాడు. కోట్ల విలువైన కార్లు, ఇళ్లు కూడా కొన్నారు. అయితే అవన్నీ సినిమా నిర్మాతగా మారి పోగొట్టుకున్నాడట.

ఇటీవ‌ల‌ ‘ఫీల్ ఇట్ ఇన్ యువర్ సోల్’ అనే పాడ్ కాస్ట్ లో క‌పిల్ శ‌ర్మ ఓపెన్ అప్ అయ్యారు. కపిల్ రెండు హిందీ చిత్రాలను నిర్మించారట. కానీ ఈ రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలిపాడు. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాన‌ని, దీనివల్ల  బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో అయ్యిందని తెలిపారు. ఇక ఆ సమయంలో చాలా నిరాశకు గుర‌య్యాన‌ని, అప్పుడు అతని భార్య గిన్ని త‌న‌కు తోడుగా ఉందని తెలిపారు. నేను ఆ తప్పులు చెయ్యకుండా ఉండుంటే వాటి నుంచి ఈ విషయాలను నేర్చుకునేవాడిని కాదని చెప్పుకొచ్చారు.

Also Read : Unstoppable : అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ నేడే స్ట్రీమింగ్.. సీఎంతో బాలయ్య..

ఒక పాపులర్ కమెడియన్ దీన్ని ‘ఇది ఒక జీవిత గుణపాఠం’ అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే.. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ దాదాపుగా రూ. 300 కోట్లకు పైగానే ఉంటుందట. అంతేకాదు ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కి రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారట.