Pawan Kalyan : కరాటే నుంచి సమురాయ్ వరకు.. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ.. అరుదైన గౌరవం.. వీడియో వైరల్..
పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మీకు కూడా చూసేయండి.. (Pawan Kalyan)
Pawan Kalyan Martial Arts Journey Video viral
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ
- మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కి అరుదైన గౌరవం
- వీడియో రిలీజ్
Pawan Kalyan : ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారని, చాలా సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ చూపించాడని అందరికి తెలుసు. ఫ్యాన్స్, ప్రేక్షకులు పవన్ మార్షల్ ఆర్ట్స్ ని ఇష్టపడ్డారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ తో ఓ సరికొత్త చరిత్ర సృష్టించారు.(Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి త్వరలో తన మార్షల్ ఆర్ట్స్ జర్నీని షేర్ చేస్తారని ప్రకటించారు ఇటీవల పవన్. తాజాగా తన మార్షల్ ఆర్ట్స్ వీడియోని షేర్ చేసారు పవన్. పవన్ కళ్యాణ్ మొదటిసారి మార్షల్ ఆర్ట్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ఈ వీడియోలో ఉంది.
Also Read : Chinna Jeeyar Swamy : అఖండ 2 సినిమాని ప్రశంసించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి..
పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మీకు కూడా చూసేయండి..
మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో మొదలయిన ప్రయాణం ఇప్పుడు జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి వాటిని సాధించారు.
జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి పవన్ కు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది. జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సెన్సై’లోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇది జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే గౌరవం. అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే బిరుదుతో సత్కారం జరిగింది. భారతదేశంలో జపాన్ యుద్ధకళలలో అగ్రగణ్యులలో ఒకరైన బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు.
Also Read : Rajasaab : ఇంత మంచి ఫైట్ సీన్ సినిమాలో పెట్టకుండా.. రాజాసాబ్ కొత్త ప్రోమో రిలీజ్.. పాపం ఫ్యాన్స్..
ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రం.. ఈ మూడింటినీ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల పిఠాపురం లో మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ పెడతాను అని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
