Kareena Kapoor
Kareena Kapoor: చూసేందుకు అందంగా కనిపించేందుకు హీరోయిన్స్ దుస్తుల నుండి చెప్పులు, హ్యాండ్ బ్యాగుల వరకు స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటారు. కొంతమంది వాటిని ధరించి ఆ తర్వాత పబ్లిక్ లో ఇబ్బందులు పడడం మనం చాలా చూసే ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ విపరీతంగా ట్రోల్ అవుతుంటాయి. ఇక, హీరోయిన్స్ ధరించిన బ్రాండెడ్ దుస్తుల ధరలేమో లక్షలలో ఉంటే అవి పీలికలు చీలికలుగా ఉండడం కూడా నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు.
Kareena Kapoor : నైటీతో బయటకి వచ్చిందంటూ కరీనాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
కరీనా కపూర్ తాజాగా ఓ టూ పీస్ ఎల్లో కలర్ కో- ఆర్డ్(పై నుంచి కింది దాకా ఒకే రకమైన ఫ్యాబ్రిక్, కలర్‌తో ఉండే కో ఆర్డినేట్ డ్రెస్) సెట్లో మెరిసే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్లోరల్ ప్రింట్ బీచ్ వేర్‌కు చిక్ బెల్ట్ జత చేసి, సింపుల్ ఇయర్ రింగ్స్, చైన్‌తో డిజైన్ భలే ఆకట్టుకుంటుంది. కాగా.. ఈ డ్రెస్ చేసిన డిజైనర్ లక్ష్మీ లెహర్. బాలీవుడ్ లో దాదాపుగా స్టార్ హీరోయిన్లందరూ ఈమె డిజైన్స్ లో మెరిసిన వాళ్లే. ఇప్పుడు డ్రెస్ కూడా కరీనా కోసం ఆమె డిజైన్ చేశారు.
Kareena Kapoor – Saif Ali Khan: కరీనా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెక్స్ డ్రైవ్ గురించి బుక్‌లో..
అయితే.. ఈ డ్రెస్ కాస్ట్ తెలిసి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు పీలికలు అక్షరాలా రూ.70 వేల రూపాయలు. డ్రెస్ లో బస్టియర్ టాప్ ధర రూ.30,599 కాగా.. నడుము పై భాగం వరకు ఉన్న షార్ట్స్ ధర రూ.39,599. మొత్తం కలిపి రూ.70 వేలు కావడంతో ఏంటి ఈ రెండు పీలికలు డెబ్భైవేలు పోసి కొనాలా అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.