Siddharth : హీరో సిద్దార్థ సినిమా ప్రమోషన్స్ కి నిరసనల సెగ.. ప్రెస్ మీట్ ని అడ్డుకున్న కావేరి కార్యకర్తలు..

సిద్దార్థ్ బెంగుళూరుకి వెళ్లి ఇలాంటి టైములో ప్రమోషన్స్ పెట్టడంతో కావేరి కార్యకర్తలు ఫైర్ అయ్యారు. సిద్దార్థ్ ప్రెస్ మీట్ పెట్టిన చోటుకి వచ్చి నినాదాలు చేస్తూ ప్రమోషన్స్ ని అడ్డుకున్నారు. ఇది సినిమా ప్రమోషన్స్ కి టైం కాదు వెళ్లిపొమ్మని సిద్దార్దని హెచ్చరించారు.

Siddharth : హీరో సిద్దార్థ సినిమా ప్రమోషన్స్ కి నిరసనల సెగ.. ప్రెస్ మీట్ ని అడ్డుకున్న కావేరి కార్యకర్తలు..

Karnataka Kaveri Protesters waring to Hero Siddharth in Chithha Movie Promotions at Benguluru

Updated On : September 29, 2023 / 9:16 AM IST

Siddharth : హీరో సిద్దార్థ్ నటించిన తమిళ సినిమా ‘చిత్తా'(Chithha) నిన్న సెప్టెంబర్ 28న రిలీజయింది. ఇది వేరే భాషలో కూడా రిలీజయింది. దీంతో సిద్దార్థ వేరే భాషల్లో కూడా తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న బెంగుళూరుకి(Bengaluru) వెళ్లి అక్కడ కన్నడలో తన సినిమాని ప్రమోట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు.

ప్రస్తుతం కర్ణాటక(Karnataka) బంద్ నడుస్తుంది. కావేరి(Kaveri) జలాల వివాదంపై తమిళనాడు, కర్ణాటకల మధ్య ఎప్పట్నుంచో వివాదం సాగుతుంది. ఇప్పుడు ఈ వివాదం మరోసారి పెద్దదవ్వగా రెండు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కావేరి కార్యకర్తలు బంద్ కి పిలుపునిచ్చారు.

Also Read : Vishal : సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన వ్యాఖ్యలు.. మార్క్ ఆంటోని రిలీజ్ అవ్వడానికి లంచం తీసుకున్నారంటూ..

అయితే సిద్దార్థ్ బెంగుళూరుకి వెళ్లి ఇలాంటి టైములో ప్రమోషన్స్ పెట్టడంతో కావేరి కార్యకర్తలు ఫైర్ అయ్యారు. సిద్దార్థ్ ప్రెస్ మీట్ పెట్టిన చోటుకి వచ్చి నినాదాలు చేస్తూ ప్రమోషన్స్ ని అడ్డుకున్నారు. ఇది సినిమా ప్రమోషన్స్ కి టైం కాదు వెళ్లిపొమ్మని సిద్దార్దని హెచ్చరించారు. దీంతో సిద్దార్థ సరే అని చెప్పి నా సినిమాని థియేటర్లో చూడండి అని వెళ్లిపోయారు. అయితే అక్కడ ఉన్న కర్ణాటక కార్యకర్తలు తమిళ సినిమాని చూడొద్దు, తమిళ సినిమాని కర్ణాటకలో బహిష్కరించండి అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.