Karthik Raju : ‘విలయ తాండవం’తో రాబోతున్న కార్తీక్ రాజు..
తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. (Karthik Raju)
Karthik Raju
Karthik Raju : కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా విలయ తాండవం. GMR మూవీ మేకర్స్ బ్యానర్ పై మందల ధర్మారావు, గుంపు భాస్కరరావు నిర్మాణంలో వీఎస్ వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఈవెంట్ జరగ్గా ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు గెస్టులుగా హాజరయ్యారు.(Karthik Raju)
ఈ ఈవెంట్లో హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. విలయ తాండవం టైటిల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది. టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ సినిమాతో మంచి పేరు రావాలి, సినిమా హిట్ అవ్వాలి అని అన్నారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేను తీసిన కౌసల్యా కృష్ణమూర్తి సినిమాలో కార్తీక్ రాజు నటించాడు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటారు. టైటిల్ పోస్టర్ అయితే నాకు చాలా నచ్చింది అని అన్నారు.
Also See : Malavika Mohanan : ఫ్రెండ్స్ తో రాజాసాబ్ భామ దసరా సెలబ్రేషన్స్.. ఫొటోలు..
హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ.. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. మంచి కాన్సెప్ట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. డైరెక్టర్ వాసు సరికొత్త పాయింట్, కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారు. అని తెలిపారు. నిర్మాత మందల ధర్మారావు మాట్లాడుతూ.. డైరెక్టర్ వాసు ఈ కథను చెప్పినప్పుడే ఆశ్చర్యపోయాను. అద్భుతమైన కథతో ‘విలయ తాండవం’ సినిమాని నిర్మించాం. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో ముందుకు వస్తాము అని అన్నారు. నిర్మాత గుంపు భాస్కరరావు మాట్లాడుతూ.. డైరెక్టర్ వాసు చెప్పిన కథలో దమ్ముంది అని నాకు అర్థమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించాం అని అన్నారు.

దర్శకుడు వీఎస్ వాసు మాట్లాడుతూ.. మా స్నేహితుడు సంజయ్ వల్లే ఈ సినిమా ప్రయాణం మొదలైంది. విలయ తాండవం టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన కార్తీక్ రాజుకి థాంక్స్. త్వరలోనే సినిమాని తీసుకొస్తాను అని తెలిపారు.
Also See : Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ దసరా స్పెషల్ ఫొటోలు.. ఫ్యామిలీతో కలిసి..

