Nirupam Paritala : ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి త్వరగా రావాలి.. డాక్టర్ బాబు కామెంట్స్..
కార్తీక దీపం సీరియల్ తో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల.. ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి త్వరగా రావాలంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

karthika deepam Nirupam Paritala comments on NTR Political entry
Nirupam Paritala : బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల.. కార్తీక దీపం సీరియల్ తో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు హీరోయిన్ నిత్యామీనన్ తో కలిసి ‘కుమారి శ్రీమతి’ అనే సిరీస్ లో నటిస్తున్నాడు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ ఈ సిరీస్‌ని.. 7 ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. కాగా నిరుపమ్ ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాడు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో నిరుపమ్.. తన కెరీర్ స్టార్టింగ్, సినిమా అవకాశాలు, భార్య మంజులతో ప్రేమ, ఇలా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇక ప్రోమో చివరిలో.. “ఎన్టీఆర్‌ని ఒక విషయం అడగాలంటే ఏం అడుగుతారు..?” అని నిరుపమ్ ని విలేకరి ప్రశ్నించింది. దానికి బదులిస్తూ.. “పాలిటిక్స్‌లోకి త్వరగా రావాలి. ఏదోకటి చేయమని” అడుగుతానని చెప్పుకొచ్చాడు.
Also read : Suhas : కొరియోగ్రాఫర్ అవ్వాలని వచ్చి.. యాక్టర్ అయ్యాను.. అల్లు అర్జున్‌కి పెద్ద అభిమానిని..
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిరుపమ్ విజయవాడకి చెందిన కుర్రాడు కావడంతోనే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక కుమారి శ్రీమతి విషయానికి వస్తే.. తన ఇంటిని కాపాడుకోవడానికి ఒక పెళ్లికాని అమ్మాయి చేసే ప్రయత్నం, తనకి తోడుగా హీరో. ఆ పెళ్లికాని అమ్మాయిగా నిత్యామీనన్, హీరోగా నిరుపమ్. సెప్టెంబర్ 28 నుంచి స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ మంచి స్పందనే అందుకుంటుంది.