ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ‘‘దొంగ’’
కార్తి, జ్యోతిక అక్కాతమ్ముళ్లుగా నటిస్తోన్న ‘దొంగ’ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది..

కార్తి, జ్యోతిక అక్కాతమ్ముళ్లుగా నటిస్తోన్న ‘దొంగ’ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది..
కార్తి.. పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ తన సినిమాలను ఎక్కువగా తెలుగు ప్రేక్షకులే ఆదరిస్తుంటారు. టాలీవుడ్‌లో తనకంటూ ఒక మంచి మార్కెట్ సెట్ చేసుకున్న ఈ స్టార్ హీరో బ్రదర్ ఇటీవల ‘ఖైదీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మళ్ళీ అదే తరహాలో సౌత్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలని కార్తి ప్లాన్ చేసుకుంటున్నాడు. కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులకు మరో ప్రయోగాన్ని చూపించబోతున్నాడు.
వదినమ్మ జ్యోతికతో చేస్తోన్న ‘తంబీ’ సినిమా ఫస్ట్ నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంటోంది. తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల కానుంది. ఇటీవల కింగ్ నాగార్జున విడుదల చేసిన ‘దొంగ’ టీజర్ ఆకట్టుకుంటోంది. మలయాళ ‘దృశ్యం’ ఫేమ్.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో, వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పణలో, పారాలాల్ మైండ్స్ ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన మరికొన్ని స్వీట్ పోస్టర్స్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
Read Also : ‘నిశ్శబ్దం’- మైకేల్ మ్యాడ్‌సన్ లుక్
షావుకారు జానకితో పాటు సత్యరాజ్, సీత వంటి సీనియర్ యాక్టర్స్‌తో కార్తీ, జ్యోతిక ఒకే కుటుంబంలో ఉన్నట్లు కనిపిస్తుండడం ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో మధ్యతరగతి కుటుంబాలకు సంబందించిన ఎమోషన్‌ని ఎలివేట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అక్కా తమ్ముళ్లుగా జ్యోతిక, కార్తి ఎలా కనిపిస్తారు అనేది అందరినీ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోన్న అంశం. మరి ‘దొంగ’ గా కార్తి ప్రేక్షకుల మనసులను ఎలా దోచుకోనున్నాడో చూడాలి మరి. ఈ సినిమాకు సంగీతం : గోవింద్ వసంత, కెమెరా : ఆర్.డి.రాజశేఖర్.