‘‘చావు కబురు చల్లగా’’ లో బస్తీ బాలరాజుగా కార్తికేయ

కార్తికేయ హీరోగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ‘‘చావు కబురు చల్లగా’’..

  • Published By: sekhar ,Published On : December 16, 2019 / 08:30 AM IST
‘‘చావు కబురు చల్లగా’’ లో బస్తీ బాలరాజుగా కార్తికేయ

Updated On : December 16, 2019 / 8:30 AM IST

కార్తికేయ హీరోగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ‘‘చావు కబురు చల్లగా’’..

‘భలే భలే మగాడివోయ్’, ‘గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘‘చావు కబురు చల్లగా’’. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.

Image

2020లో షూటింగ్ జరుపుకోనున్న ‘‘చావు కబురు చల్లగా’’ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.

Image

బ్యానర్ : GA2 pictures
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాత : బన్నీ వాసు
సహ నిర్మాత : సునీల్ రెడ్డి
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి.