బిగ్ బాస్ 3 హోస్ట్ గా కౌశల్ : భారీ ఆఫర్ 

బిగ్ బాస్ సీజన్ 3కు హోస్ట్ గా కౌశల్ అనే వార్తలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు షో నిర్వాహకులు.. కౌశల్ కు భారీ ఆఫర్ ఇచ్చారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 10:54 AM IST
బిగ్ బాస్ 3 హోస్ట్ గా కౌశల్ : భారీ ఆఫర్ 

Updated On : January 14, 2019 / 10:54 AM IST

బిగ్ బాస్ సీజన్ 3కు హోస్ట్ గా కౌశల్ అనే వార్తలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు షో నిర్వాహకులు.. కౌశల్ కు భారీ ఆఫర్ ఇచ్చారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

హైదరాబాద్ : తెలుగులో బిగ్ బాస్ 2 సీజన్ లో విన్నర్ గా నిలిచిన కౌశల్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో తెలిసిన విషయమే. నానీ హోస్ట్ గా చేసిన ఈ షోలో ఉన్న అందరికంటే కౌశల్ కు వచ్చిన స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. మొదటి నుండి షోలో అందరికీ భిన్నంగా ఉంటూ ఆఖరికి అన్ని సమస్యలను అధిగమించి విన్నర్ గా నిలిచిన కౌశల్ ప్రేక్షులు బ్రహ్మరంథం పట్టటమే కాదు విన్నర్ ని చేశారు. దీనికోసం ఎక్కడివారో..ఒక్కటిగా నిలిచి కౌశల్ ఆర్మీగా తయారయ్యి కౌశల్ కు విజయం దక్కేలా చేశారు. ఎన్నో భాషల్లో ఈ బిగ్ బాస్ షో జరిగినా..ఏ భాషలోను..ఏ సెలబ్రిటీకీ రానంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు కౌశల్.

ఈ క్రమంలో తెలుగులో బిగ్ బాస్ 3 సీజన్ ప్రారంభంకానుంది. బిగ్ బాస్ 1 సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి బెస్ట్ అనిపించుకున్నాడు..2వ సీజన్ కు నాచ్యురల్ స్టార్ నాని హోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇకపోతే బిగ్ బాస్ 3 షోకు హోస్ట్ ఎవరా అనే ఉత్కంఠపై రకరకాల పేర్లు వినిపిస్తున్న క్రమంలో సీజన్ 3కు కౌశల్ అనే వార్తలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు షో నిర్వాహకులు.. కౌశల్ కు భారీ ఆఫర్ ఇచ్చారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

గత కొన్ని రోజులుగా బిగ్ బిస్ మూడో సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. తొలి సీజన్ 70 రోజులపాటు నిర్వహించగా, రెండో సీజన్‌ 100 రోజులకు పైగా కొనసాగింది. మూడో సీజన్ ఎన్ని రోజులు చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోయినా హోస్ట్ ఎవరు అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. Bigg Boss 3 ఎవరు హోస్ట్ చేస్తారు.. ఎవరైతే న్యాయం చేయగలరనే విషయంపై నిర్వాహకులు కసరత్తులు మొదలుపెట్టారు. 

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌‌గా నాగార్జున, వెంకటేష్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండల పేర్లు వినిపించాయి. కానీ కౌశల్ మందా పేరు మాత్రం ఇటీవల ఎక్కువగా వైరల్ అయింది. రెండో సీజన్‌లో కౌశల్ పాపులారిటీని దృష్టిని పెట్టుకుని అతడికి Bigg Boss 3 హోస్ట్‌గా భారీ ఆఫర్‌ను నిర్వాహకులు ఇస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లో బిగ్ బాస్‌నే శాసించే స్థాయికి ఎదిగారు కౌశల్. 

అతడి ఆర్మీ తలుచుకుంటేనే టీఆర్పీ పెరిగింది, వద్దనుకుంటే తగ్గిన పరిస్థితి తలెత్తింది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కౌశల్‌ పేరును పరిశీలిస్తున్నారని, త్వరలో ప్రకటన వస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. తొలి సీజన్ జూలైలో, రెండో సీజన్ జూన్‌లో ప్రారంభం కాగా, మూడో సీజన్ మరికాస్త ముందుగానే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మరోవైపు కంటెస్టెంట్‌గా చేయడం వేరు, హోస్ట్‌గా చేయడం అంత ఈజీ కాదని అభిప్రాయడుతున్నారు. మరి.. అసలు హోస్ట్ ఎవరు? అనే విషయం మాత్రం బిగ్ బాస్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.