హీరో, హీరోయిన్లకు సమాన రెమ్యునరేషన్ పై కీర్తి సురేష్ రియాక్షన్.. ఒకవేళ..

ఈక్వల్ రెమ్యునరేషన్ గురించి అడగ్గా కీర్తి సురేష్ స్పందిస్తూ..

హీరో, హీరోయిన్లకు సమాన రెమ్యునరేషన్ పై కీర్తి సురేష్ రియాక్షన్.. ఒకవేళ..

Keerthy Suresh Comments on Equal Remuneration foe men and Women

Updated On : June 23, 2025 / 10:16 AM IST

Keerthy Suresh : ఇటీవల రెమ్యునరేషన్స్ విషయంలో సమంత ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఒకే రెమ్యునరేషన్స్ ఇస్తాను, నా నిర్మాణ సంస్థలో అలాగే ఇస్తాను, అందరూ అలాగే ఇస్తే బాగుంటుంది అని శుభం సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడింది. ఈ విషయం అప్పుడు బాగా చర్చగా మారింది. అయితే గతంలోనే అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం థియేటర్స్ కి జనాల్ని రప్పించేవారికే రెమ్యునరేషన్ ఇస్తారు. మార్కెట్ బేస్ చేసుకొని రెమ్యునరేషన్స్ ఇస్తారు. ఇందులో ఆడ – మగ అనే తేడా ఉండదు. అందరికి ఈక్వల్ పే అంటే ఒక లైట్ బాయ్ జనాల్ని తెప్పించలేడు కదా అని క్లారిటీ ఇచ్చారు.

తాజాగా కీర్తి సురేష్ ఈ ఈక్వల్ పే గురించి మాట్లాడింది. కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు సినిమాతో జులై 4 న అమెజాన్ ఓటీటీలోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Also Read : Akkineni Family : శోభిత వచ్చిన వేళ.. అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చి.. అఖిల్ కూడా కొట్టేస్తే..

ఈ ఇంటర్వ్యూ లో ఈక్వల్ రెమ్యునరేషన్ గురించి అడగ్గా కీర్తి సురేష్ స్పందిస్తూ.. రెమ్యునరేషన్ అనేది మహిళలు – మగవాళ్లకు సంబంధించింది కాదు. ఇందులోకి ఈక్వాలిటీ తీసుకురావడం అనేది నాకు అర్ధం కాదు. ఒక మేల్ యాక్టర్ థియేటర్ కి జనాల్ని ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో, అలా ఒక ఫీమేల్ యాక్టర్ కి కూడా ఉందంటే ఇవ్వొచ్చు. ఒక ఫిమేల్ యాక్టర్ కి జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు. ఈ హీరోయిన్ తో సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, పెద్ద కలెక్షన్ వస్తాయి అని నమ్మితే ఇవ్వొచ్చు. హీరోకి ఇంత ఇస్తారు, హీరోయిన్ కి ఇంత ఇవ్వలేదు అనేది కాదు. హీరోలాగా ఫిమేల్ యాక్టర్ కూడా జనాల్ని థియేటర్స్ కి తీసుకొస్తే ఇవ్వొచ్చు. హీరోలకు ఇస్తారంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్, చాలా మంది వస్తారు కాబట్టి ఇస్తారు అని తెలిపింది.

 

Also See : Meenaakshi Chaudhary : హాట్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి..