మహానటికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర అవార్డును అందజేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా కీర్తీ సురేష్ అవార్డును స్వీకరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కీర్తి సురేష్.. ఈ అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, మంచి పాత్రలు ఎంచుకుని నటిగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి మెప్పించగా ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా అవార్డులు దక్కించుకోవడమే కాదు. కమర్షియల్‌గా కూడా కాసులు తెచ్చిపెట్టింది. త్వరలోనే రాష్ట్రపతి నుంచి కీర్తీ సురేష్ జాతీయ అవార్డు కూడా అందుకోబోతుంది. అంతకుముందే కేరళ రాష్ట్ర అవార్డును ఆమె అందుకున్నారు.