అనుమానాస్పద స్థితిలో ఫేమస్ టీవీ సెలబ్రిటీ మృతి

  • Published By: vamsi ,Published On : December 24, 2019 / 02:51 AM IST
అనుమానాస్పద స్థితిలో ఫేమస్ టీవీ సెలబ్రిటీ మృతి

Updated On : December 24, 2019 / 2:51 AM IST

వంటల ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయిన టీవీ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని కురావాన్ కోణం ప్రాంతంలోని తన ఇంట్లోని వంటగదిలో జాగీ జాన్ చనిపోయి కనిపించింది. జాగీ జాన్ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అంజేసింది.

జాగీ జాన్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు. జాగీజాన్ అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆమె పోస్టుమార్టం తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉంది. చెఫ్ గా, మోడల్ గా జాగీ జాన్ బాగా పాపులర్. జాగీ జాన్ చనిపోయిన సమయంలో ఆమె తల్లి ఇంట్లోనే ఉన్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో జాగీ జాన్ మృతికి గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.

జాగీజాన్ ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారా? ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జాగీ జాన్ గాయని కూడా. అలాగే ఉత్తేజపరిచే ప్రసంగాలు కూడా ఇవ్వగలదు. జాగీ జాన్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండేవారు. తరచుగా ఫోటోలు షేర్ చేసేవారు. ప్రస్తుతం ఓ టెలివిజన్ ఛానల్లో జాగీ జాన్ ‘జాగీ కుక్ బుక్ అనే కార్యక్రమం చేస్తున్నారు.