Ketika Sharma: అట్రాక్ట్ చేస్తున్న రొమాంటిక్ పిల్ల.. క్యూ కడతారా?

అనుష్క, కాజల్, తమన్నా లాంటి హీరోయిన్స్ పాతపడిపోయారు. పూజ హెగ్డే, రష్మిక లాంటి వాళ్ళు ఫుల్ బిజీ, దానికి తోడు భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు ఓ మోస్తరు..

Ketika Sharma: అట్రాక్ట్ చేస్తున్న రొమాంటిక్ పిల్ల.. క్యూ కడతారా?

Ketika Sharma

Updated On : October 28, 2021 / 6:36 PM IST

Ketika Sharma: అనుష్క, కాజల్, తమన్నా లాంటి హీరోయిన్స్ పాతపడిపోయారు. పూజ హెగ్డే, రష్మిక లాంటి వాళ్ళు ఫుల్ బిజీ, దానికి తోడు భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు ఓ మోస్తరు సినిమాలకు.. ఇప్పుడిప్పుడే స్టార్స్ గా ఎదిగే హీరోలకు, రవితేజ , రామ్ లాంటి హీరోలకు హీరోయిన్స్ దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి వారంతా ఇప్పుడు కొత్తగా వచ్చే అప్ కమింగ్ హీరోయిన్స్ లో స్టార్ మెటీరియల్ ను వెలికి తీసే పనిలో ఉన్నారు.

Tees Maar Khan: బీచ్ ఒడ్డున రొమాన్స్‌లో మునిగిన పాయల్, ఆది!

ఇప్పటికే ఉప్పెనతో టాలీవుడ్ సక్సెస్ ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టికి వరస ఆఫర్లు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తెలుగులో అడుగు పెడుతున్న కేతిక శర్మ తెలుగు మేకర్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. ఇదే తొలి సినిమా అయినా అంతకు ముందే సోషల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్ కేతిక సొంతం. దీనికి తోడు పూరి లాంటి హౌస్ నుండి ఎంట్రీ ఇవ్వడం.. రొమాంటిక్ లో బోల్డ్ స్టిల్స్ కూడా కేతికాకు ప్లస్ గా కనిపిస్తున్నాయి.

Mehreen Pirzada: ముచ్చెమటలు పుట్టించే మెరుపుతీగ మెహ్రీన్!

ఇప్పటికే పూరి జగన్నాధ్ తన సహచర దర్శకులకు రొమాంటిక్ సినిమాను స్పెషల్ షో ద్వారా చూపించాడు. దీంతో ఇందులో కేతికా గ్లామర్ తో పాటు యాక్టింగ్ కు కూడా ప్రశంసలు దక్కాయి. ఇటు యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా సెట్టయ్యే మెటీరియల్ గా కేతికాను ఇప్పుడు టాలీవుడ్ గమనిస్తుంది. ఇక రొమాంటిక్ సినిమా కనుక సక్సెస్ కొడితే కేతికా టాలీవుడ్ లో సెటిల్ కావడం ఖాయమంటున్నారు.