Ravi Basrur : కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. పాపం కరోనా టైంలో ఇలా..
సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందో అందరికి తెలిసిందే. ప్రతి ఎలివేషన్ సీన్లో, అమ్మ సెంటిమెంట్స్ లో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమా చూసి బయటకి........

Ravi Basrur
Ravi Basrur : ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజిఎఫ్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ వసూళ్లు సాధిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ మంచి పేరు వస్తుంది. ఇక ఈ సినిమాకి పని చేసిన వారి గురించి కూడా తెలుసుకోవడానికి ప్రేక్షకులు, నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పార్ట్ 2 ఎడిటర్ ఉజ్వల్ గురించి అంతా మాట్లాడుకున్నారు. 19 ఏళ్లకే సినిమాని ఈ రేంజ్ లో ఎడిట్ చేసాడు అని అభినందనలు కురిపిస్తున్నారు.
ఈ సినిమాలో అందరూ మాట్లాడుకునే ఇంకో అంశం మ్యూజిక్. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందో అందరికి తెలిసిందే. ప్రతి ఎలివేషన్ సీన్లో, అమ్మ సెంటిమెంట్స్ లో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత కూడా ఆ మ్యూజిక్ ఇంకా మన చెవుల్లో మోగుతుందంటే అదంతా మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనమే. ఇప్పుడు అంతా ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Armaan Malik : ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది.. వెయిట్ చేయండి.. మహేష్ ఫ్యాన్స్‌పై సీరియస్ అయిన సింగర్
కరోనా సమయంలో ఎంతోమంది ఎన్నో బాధలు చూసారు. చాలా మంది జీవితాలను మారిపోయాయి. పనుల్లేక సొంతూళ్లకు వెళ్లి ఏదో ఒక పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా గతంలో పలు సినిమాలకి పని చేసాడు. కరోనా టైంలో సినీ పరిశ్రమ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ టైంలో సినీ కార్మికులెవ్వరికి పని లేదు. దీంతో కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కూడా తన సొంత ఊరికి వెళ్లి వాళ్ళ కుల వృత్తిని చేసుకున్నాడు. అక్కడ ఊరిలో వాళ్ళ నాన్నకి సహాయం చేశాడు.
Rakul Preet Singh : ప్రతిసారి పెళ్లి గురించి అడగకండి.. చెప్పాల్సిన అవసరం లేదు..
ఊరిలో వాళ్ళ వృత్తి కమ్మరి పని కావడంతో కరోనా సమయంలో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే కుమ్మరి పని చేసుకుంటూ కొన్ని నెలలు జీవించాడు రవి. కరోనా కష్ట కాలంలో ఉడిపి జిల్లా- కుందాపురా తాలూకాలోని తన గ్రామానికి వెళ్లి అతని తండ్రికి సహాయం చేస్తూ జీవించాడు. అప్పుడు అతను పని చేస్తున్నప్పటి ఫోటో బయట పడటంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి విధి రాతకి ఇలా పనులు చేసుకోవాల్సి వచ్చింది అంటూ నెటిజన్లు జాలి చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కేజిఎఫ్ 2తో తన కెరీర్ ని గాడిలో పెట్టాడు రవి.