Yash : నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చిన యశ్.. భారీ యాక్షన్ బడ్జెట్ సినిమా కాదట!
మలేషియాలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న యశ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చాడు. Yash19 భారీ యాక్షన్ బడ్జెట్ సినిమా అని నేను చెప్పలేను. కానీ..

KGF star Yash gave an update on Yash19 at Malaysia event
Yash : రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ (KGF) చిత్రాల తరువాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. KGF2 తో భారీ విజయం అందుకొని పాన్ ఇండియా ఇమేజ్ ని అందుకున్న ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్యలో యశ్ మళ్ళీ కేజీఎఫ్ సిరీస్ లో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దానిలో నిజం లేదని యశ్ తో పాటు దర్శకనిర్మాతలు కూడా తెలియజేశారు. దీంతో Yash19 పై మళ్ళీ సస్పెన్స్ మొదలైంది. ఇక యశ్ ని సోషల్ మీడియాతో పాటు బయట ఎక్కడ కనిపించిన ఈ సినిమా గురించే ప్రశ్నిస్తూ వస్తున్నారు అభిమానులు.
Yash : మలేషియాలో రాకీ భాయ్ గోల్డ్ స్టోర్.. బాడీగార్డ్స్, భారీ కాన్వాయితో కేజీఎఫ్3 రేంజ్ ఎంట్రీ..
తాజాగా ఈ హీరో మలేషియా ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్ కి హాజరయ్యాడు. ఇక ఆ కార్యక్రమానికి యశ్ వస్తున్నాడని తెలుసుకున్న మలేషియా అభిమానులు తనని చూసేందుకు ఆ ఈవెంట్ దగ్గరికి భారీ ఎత్తున చేరుకున్నారు. మలేషియాలో యశ్ ఫాలోయింగ్ చూసి ఇక్కడ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఆ ఈవెంట్ లో యశ్ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి వారి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే Yash19 గురించి ప్రశ్నించగా యశ్ బదులిస్తూ.. “నేను దాని మీదనే పని చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ భారీ యాక్షన్ బడ్జెట్ సినిమా అని నేను చెప్పలేను. కానీ మంచి సినిమా. అందరికి నచ్చుతుంది. త్వరలోనే అనౌన్స్ చేస్తాను అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి” అంటూ చెప్పుకొచ్చాడు.
I will be Announcing Very Soon , Have patience guys, yash19 definitely a kickass project ??
– #YashBOSS today in Malaysia Event” Malaysia Welcomes YASHBOSS “#Yash #Yash19 @TheNameIsYash pic.twitter.com/MOOFft6Vea
— Only Yash™ (@TeamOnlyYash) July 8, 2023
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల కన్నడనాట Yash19 మూవీ నేషనల్ అవార్డు విన్నర్ దర్శకత్వంలో ఉండబోతుందని వార్తలు వినిపించాయి. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ (Geetu Mohandas) వినిపించిన స్టోరీలోని హీరో పాత్ర యశ్ కి చాలా ఛాలెంజింగా అనిపించిందట. కొంత కాలంగా ఇదే సినిమా పై పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.