Raviteja : సినిమా రిలీజ్ అవ్వకముందే ‘ఖిలాడీ’ డైరెక్టర్‌కి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత
'ఖిలాడీ' సినిమా రైట్స్ అన్ని భారీ ధరకు అమ్ముడుపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. దీంతో డైరెక్టర్ రమేష్ వర్మకి ఖిలాడీ సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ కోటి........

Khiladi (1)
Khiladi : ఇటీవల సినిమాలు రిలీజ్ అయి భారీ విజయం సాధిస్తే ఆ సినిమా హీరోలు కానీ, నిర్మాతలు కానీ డైరెక్టర్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఇదే ఫాలో అవుతున్నారు. గోల్డ్ లేదా కార్ ఇలా ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు. తాజాగా మరో నిర్మాత కూడా తమ సినిమా డైరెక్టర్ కి ఖరీదైన కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే గిఫ్ట్ ఇవ్వడం.
రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడీ’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. రవితేజ ఇప్పటికే క్రాక్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నారు. దీంతో ‘ఖిలాడీ’ సినిమా రైట్స్ అన్ని భారీ ధరకు అమ్ముడుపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఇటీవలే ‘ఖిలాడీ’ టీం నుంచి సోల్డ్ అవుట్ అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
Ajith : 22 ఏళ్ళ తర్వాత అజిత్-టబు కాంబినేషన్లో సినిమా
దీంతో డైరెక్టర్ రమేష్ వర్మకి ఖిలాడీ సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ కోటి 15 లక్షల వ్యాల్యూ గల రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇంత ఖరీదైన కారుని సినిమా రిలీజ్ అవ్వకముందే ఇవ్వడం విశేషం. దీంతో ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ‘ఖిలాడీ’ సినిమా పక్కా సూపర్ హిట్ కొడుతుంది అని సినిమా టీం ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది.