Khiladi: రవితేజ దీపావళి గిఫ్ట్.. టైటిల్ సాంగ్ వచ్చేస్తుంది

మాస్ మహారాజ రవితేజ హీరోగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ఖిలాడి".

Khiladi: రవితేజ దీపావళి గిఫ్ట్.. టైటిల్ సాంగ్ వచ్చేస్తుంది

Khiladi

Updated On : November 1, 2021 / 7:12 PM IST

Khiladi Title song: మాస్ మహారాజ రవితేజ హీరోగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “ఖిలాడి”. ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా.. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీపావళి కానుకగా.. సెకండ్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

నవంబర్ 4వ తేదీన ఉదయం 10గంటల 8నిమిషాలకు దీపావళి కానుకగా సెకండ్ సింగిల్ విడుదల కానుంది. రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తుండగా.. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సత్యనారాయణ కోనేరు నిర్మాత కాగా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది ఈ సినిమా. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.