Kiara Advani: వామ్మో కియారా ఇంత పెంచేసిందా?

కియారా అద్వానీ బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బీ టౌన్ లో ఇప్పుడున్న క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ దూసుకుపోతుంది. 'భరత్ అనే నేను'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కియారా తర్వాత రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ'లో నటించింది. ఇక్కడ ఈ సినిమాలు పెద్దగా అమ్మడిని అందలం ఎక్కించలేదు కానీ తిరిగి మళ్ళీ బాలీవుడ్ లోనే చేసిన కబీర్ సింగ్ మాత్రం కియారా రేంజ్ ఒక్కసారిగా పెంచేసింది.

Kiara Advani: వామ్మో కియారా ఇంత పెంచేసిందా?

Kiara Advani

Updated On : August 5, 2021 / 8:40 PM IST

Kiara Advani: కియారా అద్వానీ బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బీ టౌన్ లో ఇప్పుడున్న క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ దూసుకుపోతుంది. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కించే ఈ యంగ్ బ్యూటీ జస్ట్ బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ మీద కూడా ఓ కన్నేసి ఉంచింది. ‘భరత్ అనే నేను’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కియారా తర్వాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో నటించింది. ఇక్కడ ఈ సినిమాలు పెద్దగా అమ్మడిని అందలం ఎక్కించలేదు కానీ తిరిగి మళ్ళీ బాలీవుడ్ లోనే చేసిన కబీర్ సింగ్ మాత్రం కియారా రేంజ్ ఒక్కసారిగా పెంచేసింది.

కబీర్ సింగ్ సినిమా తర్వాత కియారా డిమాండ్ పెరగడంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలని.. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకుంది. నిజానికి కియారా తెలుగులో చేసిన రెండు సినిమాలకు కూడా రెమ్యునరేషన్ కోటి దాటలేదు. అయితే.. కబీర్ సింగ్ తర్వాత ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేసిన ఈ భామ ఇప్పుడు సినిమాకు మూడు కోట్లకు తక్కువ ముట్టడం లేదట. ఇక, రామ్ చరణ్ – శంకర్ సినిమా కోసమైతే ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు వినిపిస్తుంది.

రామ్ చరణ్ – శంకర్ ల సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవల్ లో హిందీ, తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా విడుదల కానున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేయనున్నారు. అసలే దిల్ రాజు అర్ధ సెంచరీ సినిమా కాగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. బహుశా ఇది గమనించే కియారా ఐదు కోట్లు డిమాండ్ చేసిందేమో. మొత్తానికి నాలుగున్నర కోట్లకు బేరం తెగ్గొట్టి సైన్ చేయించుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా కూడా భారీ సక్సెస్ కొడితే ఇక కియారా ఎన్నికోట్లు అడుగుతుందో మరి!