Ram Charan : RRR తరువాత కూడా రామ్‌చరణ్ ఏమి మారలేదు.. కియారా అద్వానీ!

రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటిస్తున్న రెండో చిత్రం 'RC15'. ఇప్పటికే మొదలైన RC15.. కియారా పెళ్లి మరియు RRR ఆస్కార్ ప్రమోషన్స్ వలన షూటింగ్ కి బ్రేక్ లు పడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ సినిమా కొత్త షెడ్యూల్ మరియు రామ్ చరణ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

Ram Charan : RRR తరువాత కూడా రామ్‌చరణ్ ఏమి మారలేదు.. కియారా అద్వానీ!

kiara advani viral comments on ram charan

Updated On : March 5, 2023 / 5:22 PM IST

Ram Charan : రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ‘RC15’. గతంలో ‘వినయ విధేయ రామ’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పటికే మొదలైన RC15.. కియారా పెళ్లి మరియు RRR ఆస్కార్ ప్రమోషన్స్ వలన షూటింగ్ కి బ్రేక్ లు పడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ సినిమా కొత్త షెడ్యూల్ మరియు రామ్ చరణ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

Ram Charan : షారుఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్?

‘వినయ విధేయ రామ సినిమా తరువాత మళ్ళీ రామ్ చరణ్ తో కలిసి నటించడం ఎలా అనిపిస్తుంది’ అని అడిగిన విలేకరి ప్రశ్నకు కియారా బదులిస్తూ.. ”తనతో కలిసి నటించడం నాకు చాలా నచ్చుతుంది. చాలా మంచి యాక్టర్, అంతకుమించి ఎక్స్‌లెంట్ డాన్సర్. RC15 మా ఇద్దరికీ చాలా ప్రత్యేకం. శంకర్ సార్ ఈ సినిమాని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ నెలలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది” అంటూ తెలియజేసింది.

అలాగే రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్ RRR సక్సెస్ ముందు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఎప్పుడు మర్యాదగా ఒదిగే ఉంటాడు. అదే తనని స్టార్ చేసింది’ అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ నెల చివరి వారంలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుండగా.. ఈ షెడ్యూల్ లో ప్రభుదేవా కోరియోగ్రఫీలో చరణ్, కియారా పై ఒక సాంగ్ చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది. ఇక మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజున సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తారు అంటూ ఫిలిం వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.