Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీ రిలీజ్ వాయిదా.. కారణం ఏమిటో?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం, తాజాగా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీ రిలీజ్ వాయిదా.. కారణం ఏమిటో?

Kiran Abbavaram Next Movie Release Postponed

Updated On : September 3, 2022 / 6:41 PM IST

Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం, తాజాగా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరంపై సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి కామెంట్స్

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఈసారి పక్కా ప్లానింగ్‌తో రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

Kiran Abbavaram : పవన్ దెబ్బకి వెనక్కి తగ్గిన మరో యువ హీరో

ఈ సినిమాలో అందాల భామలు సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య దీప్తి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీధర్ గాధె డైరెక్ట్ చేస్తుండగా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ ఈ సినిమాను తెరకెక్కించింది. మరి సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.