Kiran Abbavaram – Rahasya Gorak : తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. తన భార్య ప్రగ్నెంట్ అంటూ ఫొటో షేర్ చేసి..

కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరఖ్ గర్భవతి అయిందని ప్రకటించాడు.

Kiran Abbavaram – Rahasya Gorak : తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. తన భార్య ప్రగ్నెంట్ అంటూ ఫొటో షేర్ చేసి..

Kiran Abbavaram Wife Rhasya Gorak Became Pregnant

Updated On : January 21, 2025 / 10:03 AM IST

Kiran Abbavaram – Rahasya Gorak : యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే క సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. త్వరలోనే దిల్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం పెళ్లి, సినిమా హిట్.. ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయం తెలిపాడు.

కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరఖ్ గర్భవతి అయిందని ప్రకటించాడు. తన భార్య రహస్యతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కిరణ్ – రహస్య జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kiran Abbavaram Wife Rhasya Gorak Became Pregnant

Also Read : Dil Raju : ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్.. దిల్ రాజు ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ దాడులు..

కిరణ్ – రహస్య ఇద్దరూ కలిసి రాజావారు రాణిగారు సినిమాలో నటించారు. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడి ఆల్మోస్ట్ 5 ఏళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్యే చేసుకోగా, కిరణ్ సొంతూళ్లో మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు.

Kiran Abbavaram Wife Rhasya Gorak Became Pregnant

ఇటీవల క సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసొస్తుందని, రహస్య తన లక్కీ చామ్ అని చెప్పుకొచ్చాడు. కిరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నా రహస్య మాత్రం సినిమాలు ఆపేసింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ తర్వాత వరుస ఫ్లాప్స్ చూసాడు. మళ్ళీ గత సంవత్సరం క సినిమాతో 50 కోట్ల గ్రాస్ సాధించి తన కెరీర్లోనే పెద్ద హిట్ సాధించాడు కిరణ్. తన తర్వాతి సినిమా దిల్ రుబా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.

Also Read : Identity Trailer : త్రిష ‘ఐడెంటిటీ’ ట్రైలర్ రిలీజ్.. ఫ్లైట్ లో యాక్షన్ సీన్స్ మాములుగా లేవుగా..