Dil Raju : ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్.. దిల్ రాజు, పుష్ప 2 నిర్మాతల ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ దాడులు..

నేడు దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరగడంతో టాలీవుడ్ షాక్ లో ఉంది.

Dil Raju : ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్.. దిల్ రాజు, పుష్ప 2 నిర్మాతల ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ దాడులు..

IT Raids on Tollywood Producer Dil Raju Office and Home From Early Morning

Updated On : January 24, 2025 / 4:28 PM IST

Dil Raju : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వచ్చారు. ఇందులో గేమ్ ఛేంజర్ సినిమా యావరేజ్ గా నిలిచి నష్టాలు మిగిలిస్తే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం పెద్ద హిట్ అయి ఫుల్ ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. అలాగే ఈ సంక్రాంతికి వచ్చిన బాలయ్య డాకు మహారాజ్ సినిమా కూడా దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఈ సినిమాకు కూడా బాగానే లాభాలు వచ్చాయి.

దీంతో సంక్రాంతి ముందు నుంచి దిల్ రాజు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నేడు దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరగడంతో టాలీవుడ్ షాక్ లో ఉంది. నేడు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో ఉన్న దిల్ రాజు, దిల్ రాజు సోదరుడు శిరీష్, దిల్ రాజు కూతురు హన్షిత ఇళ్లతో పాటు దిల్ రాజు రెండు ఆఫీసుల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేసారు. మొత్తం 8 చోట్ల 55 మంది అధికారులు ఈ రైడ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read : Director Padmavathi Malladi : ప్రభాస్ సినిమాకు పనిచేసి.. ఇప్పుడు డైరెక్టర్ గా సుకుమార్ కూతురితో సినిమా..

దిల్ రాజుని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నియమించారు. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు టాలీవుడ్ తో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. ప్రభుత్వానికి సినీ పరిశ్రమ తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. ఇలాంటి సమయంలో దిల్ రాజు ఇల్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం రాజకీయాల్లో కూడా చర్చగా మారింది. పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లోనూ, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వీరితో పాటు సింగర్ సునీత భర్త రాముకి చెందిన మ్యాంగో కంపెనీలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.

ఇక డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ స్థాపించి దిల్ సినిమాతో నిర్మాతగా మారి వరుస విజయాలతో టాలీవుడ్ అగ్ర నిర్మాతగా నిలిచారు. దిల్ రాజు కూతురు హన్షిత నిర్మాతగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు డ్రీమ్స్ అనే మరో కొత్త బ్యానర్ ని కూడా స్థాపించారు దిల్ రాజు. సంక్రాంతికి ఒక సినిమాకి నష్టాలు వచ్చినా మిగిలిన రెండు సినిమాలకు ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయని ఆనందించేలోపే ఇలా ఐటీ దాడులు జరగడంపై టాలీవుడ్ విస్మయం చెందుతుంది.

Also Read : Bhairavam Teaser : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్.. మల్టీస్టారర్.. ‘భైరవం’ టీజర్ చూశారా?