Kodi Divya : నాన్న ఉన్నప్పుడే కథలు రాసుకున్నా.. భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేస్తాను..

కోడి దివ్య మీడియాతో మాట్లాడుతూ.. ''ఒక మంచి సినిమాని నిర్మించాలని ఎప్పట్నుంచో అనుకున్నాను. సినిమా నిర్మాణం అనేది చాలా సవాళ్లతో కూడుకున్న పని. ఈ సినిమా నాకు మంచి అనుభవం నేర్పింది. పూర్తిస్థాయి................

Kodi Divya : నాన్న ఉన్నప్పుడే కథలు రాసుకున్నా.. భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేస్తాను..

Kodi Divya planning direction in feature

Updated On : September 14, 2022 / 11:11 AM IST

Kodi Divya :  తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు దివ్య ఇప్పుడు నిర్మాతగా తన తొలిచిత్రంతో రాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా సంజన ఆనంద్, సోను ఠాకూర్ హీరోయిన్స్ గా ‘నేను మీకు బాగా కావల్సినవాడిని’ సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత కోడి దివ్య మీడియాతో మాట్లాడింది.

Naga Chaitanya : థియేటర్ ఏమైపోతుంది అన్నారు.. నాతో అయిదు నిమిషాల ఫైట్ చేసే క్యారెక్టర్ నుండి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

కోడి దివ్య మీడియాతో మాట్లాడుతూ.. ”ఒక మంచి సినిమాని నిర్మించాలని ఎప్పట్నుంచో అనుకున్నాను. సినిమా నిర్మాణం అనేది చాలా సవాళ్లతో కూడుకున్న పని. ఈ సినిమా నాకు మంచి అనుభవం నేర్పింది. పూర్తిస్థాయి కుటుంబ వినోదంతో ఈ సినిమా తెరకెక్కింది. మా సంస్థలో మంచి కథలు కుదిరితే భారీ బడ్జెట్‌ సినిమాలైనా నిర్మిస్తాను. దర్శకత్వంపై కూడా ఆలోచనలు ఉన్నాయి. చిన్నప్పట్నుంచి నాన్నని చూసి దర్శకత్వం అంటే ఇష్టం ఏర్పడింది. నాన్న ఉన్నప్పుడే కొన్ని కథలు సిద్ధం చేసుకున్నా. వాటితో భవిష్యత్తులో తప్పకుండా సినిమాలు తీస్తాను” అని తెలిపారు.